తెలంగాణ

telangana

Roads Damaged: ప్రమాదకరం.. అడుగుకో గుంత...గజానికో గొయ్యి .. ఎక్కడంటే..?

By

Published : Nov 25, 2021, 9:58 AM IST

Konaseema Roads Damage: అడుగుకో గుంత.. గజానికో గొయ్యి...! ఇలాంటి రోడ్లపై ప్రయాణమంటే మామూలు రోజుల్లోనే జనం మావల్ల కాదంటూ వెనకడుగువేస్తారు..! అలాంటిది.. ఇప్పుడు అసలే వర్షాలు.. ఇక చెప్పేదేముంది రోడ్లు కాస్తా నరకానికి నకళ్లుగా మారాయి..! తప్పదని బయటికెళ్తే ఒళ్లు హూనం అవుతోంది..వాహనాలు గుళ్లవుతున్నాయి! ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం-అమలాపురం రోడ్డుపై ప్రయాణం అంటేనే.. జనం బెంబేలెత్తుతున్నారు.

Roads Damaged, roads damaged in ap, ap roads, ap roads damaged
రోడ్లన్నీ గుంతమయం

Roads Damaged in AP: ఇదీ ఇక్కడి రహదారుల పరిస్థితి.! ఇదెక్కడో మారుమాల రోడ్డుకాదు.! ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం నుంచి అమలాపురంవెళ్లే రహదారి. ఈ మార్గంలో రాకపోకలు సాహసమే..! క్షేమంగా గమ్యస్థానం చేరాలని.. వాహనదారులు దేవుణ్ని తలచుకునిగానీ రోడ్డెక్కడంలేదు. రాజమహేంద్రవరంతో పాటు విజయవాడ, పశ్చిమగోదావరి జిల్లా నుంచి వాహనాలు కోనసీమలోకి(Konaseema Roads Damaged) వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. 37 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ రోడ్డు రెండేళ్లుగా ప్రమాదకరంగా మారింది.

రోడ్లన్నీ గుంతమయం

తాత్కాలిక మరమ్మతులతో..

కోనసీమలోని కొత్తపేట, పి.గన్నవరం, ముమ్మిడివరం, అమలాపురం పరిధిలోని ప్రజలు,నేతలు, అధికారులు..నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రోజూ వేలవాహనాలు రావులపాలెం-అమలాపురం మధ్య తిరుగుతుంటాయి. రావులపాలెం, కొత్తపేట, అంబాజీపేట, అమలాపురం పరిధిలో చాలాచోట్ల రోడ్డు పూర్తిగా(Ravulapalam to Amalapuram Road) ధ్వంసమైంది. రావులపాలెం-కొత్తపేట మధ్య ప్రయాణం అంటనే సాహసయాత్రలా మారింది. అధికారులు ఎప్పటికప్పుడు.. తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారు. ఫలితంగా కొన్నిరోజులకే మళ్లీ గోతులు తేలుతున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు.
రావులపాలెం - అమలాపురం రోడ్డును 2011లో సిద్ధం చేశారు. విస్తరించాలని నాలుగేళ్ల కిందటే నిర్ణయించినా.. ఇప్పటీకీ పనులు ప్రారంభం కాలేదు. గంటలకొద్దీ ప్రయాణంలో ఒళ్లు హూనం కావడం సహావాహనాలూ దెబ్బతింటున్నాయనే వాహనదారుల ఆవేదన ఎవరికీ పట్టడం లేదు. ఈ రహదారి పునర్నిర్మాణానికి ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచినా.. గుత్తేదారులు ముందుకు రాలేదు. రూ.15 కోట్ల 90 లక్షల అంచనాతో తాజాగా మళ్లీ టెండర్లు పిలిచారు. ఈసారైనా కోనసీమ ప్రధాన రహదారికి మోక్షం లభిస్తుందా అని.. జనం ఎదురు చూస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details