తెలంగాణ

telangana

షైన్​ అగ్ని ప్రమాదంలో విచారణ ముమ్మరం

By

Published : Oct 23, 2019, 11:31 AM IST

షైన్‌ చిన్న పిల్లల ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంపై అధికార యంత్రాగం విచారణ ముమ్మరం చేసింది. వివిధ శాఖల అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదానికి గల కారణాలు, ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం, అగ్ని ప్రమాదం జరిగిన తీరు వంటి విషయాలపై లోతుగా ఆరా తీశారు. వీటిపై సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందించనున్నారు.

SHINE children's HOSPITAL Fire accident enquiry speedup

షైన్​ అగ్నిప్రమాదం: విచారణ ముమ్మరం
హైదరాబాద్​ ఎల్బీనగర్‌లోని షైన్‌ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ మొదలైంది. ఘటన జరగటానికి ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. వివిధ శాఖల అధికారుల బృందం ఘటనా స్థలాన్ని సందర్శించిన సమయంలో అనేక లోపాలు బయటపడ్డాయి. ప్రధానంగా అత్యవసర చికిత్స విభాగంలోని రిఫ్రిజరేటర్ నుంచి పొగలు చెలరేగి.. క్రమంగా మంటలు వ్యాపించినట్లు విద్యుత్‌ శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు నాలుగు రోజుల ముందు ఓ ప్రమాదం జరిగినప్పటికీ ఆసుపత్రి యాజమాన్యం... ఏలాంటి జాగ్రత్తలు చేపట్టలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ అదనపు సంచాలకులు రవీంద్ర నాయక్‌, ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌, విద్యుత్‌ శాఖ అధికారి వెంకట రమణ, బాలల హక్కుల కమిషన్‌ సభ్యులు ఆసుపత్రికి వచ్చి ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

అగ్నిప్రమాదం వ్యవహారంలో షైన్‌ ఆసుపత్రి యాజమాన్యంపై పోలీసులు 304ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఆసుపత్రి ఎండీ సునీల్ కుమార్ ఇంకా అందుబాటులోకి రాలేదని ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు.

మరోవైపు బాలల హక్కుల కమిషన్‌ ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. ప్రమాదంపై విచారణ జరుపుతున్న ప్రభుత్వ విభాగాల నుంచి నివేదికలు తెప్పించుకొని వాటిని పరిశీలించనుంది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శాఖ కమిటీతో పాటు విద్యుత్‌ శాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకొని అక్కడ సిబ్బంది, ప్రత్యక్ష సాక్షులను విచారించారు.

అగ్ని ప్రమాదంలో గాయపడిన అయిదుగురు చిన్నారులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విచారణ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టడానికి సర్కారు సిద్ధమవుతోంది. ఈ ఘటనతో ఆసుపత్రుల్లో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నగరంలో అనేక ఆసుపత్రుల్లోనూ తక్షణం తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: 'ముట్టడి'పై కాంగ్రెస్‌ సీనియర్ల సీరియస్‌

TAGGED:

ABOUT THE AUTHOR

...view details