తెలంగాణ

telangana

'జీఆర్​పీ కానిస్టేబుల్​ సమయస్ఫూర్తి... నిలిచిన వ్యక్తి ప్రాణాలు'

By

Published : Mar 8, 2020, 11:19 PM IST

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో జీఆర్​పీ కానిస్టేబుల్​ సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలు నిలిచాయి. నర్సాపూర్​ ఎక్స్​ప్రెస్​ ఎక్కుతున్న ఓ ప్రయాణికుడు హఠాత్తుగా జారిపడ్డాడు. వెంటనే స్పందించిన కానిస్టేబుల్​ అతడిని కాపాడారు.

constable
constable

'జీఆర్​పీ కానిస్టేబుల్​ సమయస్ఫూర్తి... నిలిచిన వ్యక్తి ప్రాణాలు'

సికింద్రాబాద్​ రైల్వే జీఆర్​పీ పోలీసులు ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడారు. విజయవాడకు చెందిన ఎలమందరావు అనే ప్రయాణికుడు నర్సాపూర్ ఎక్స్​ప్రెస్​లో సొంతూరు వెళ్లేందుకు సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​కు వచ్చాడు. రైలు ఎక్కుతుండగా హఠాత్తుగా జారి రైలు పట్టాల కిందపడ్డాడు. వెంటనే స్పందించిన జీఆర్​పీ కానిస్టేబుల్ డేవిడ్ రాజు ఇతరుల సహాయంతో అతన్ని పైకి లాగారు.

ఘటనలో స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ.. స్టేషన్​లోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ డేవిడ్ రాజును రైల్వే ఎస్పీ అభినందించారు.

ఇదీ చూడండి:హోలీ సందర్భంగా కుస్తీ పోటీలు

ABOUT THE AUTHOR

...view details