తెలంగాణ

telangana

holidays for schools: పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు

By

Published : Jun 15, 2021, 8:21 PM IST

రాష్ట్రంలో పాఠశాలలకు వేసవి సెలవులు మరో ఐదు రోజులు పొడిగించారు. ఈనెల 19 వరకు లాక్ డౌన్ ఉన్నందున.. 20 వరకు పొడిగిస్తూ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

schools summer holidays
పాఠశాలల వేసవి సెలవులు మరోసారి పొడిగింపు

కరోనా నేపథ్యంలో పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 20 వరకు సెలవులు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. గతంలో పొడిగించిన వేసవి సెలవులు మంగళవారంతో ముగిశాయి.

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ ఈనెల 20 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలవుతోంది. జులై 1 నుంచి ఆన్ లైన్ తరగతులతో విద్యా సంవత్సరం ప్రారంభించాలని పాఠశాల విద్యా శాఖ భావిస్తోంది.

ఇదీ చూడండి:Inter: జులై 1 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఆన్‌లైన్ తరగతులు

ABOUT THE AUTHOR

...view details