తెలంగాణ

telangana

భద్రత మరిచి.. తుంగభద్రలోకి!

By

Published : Jun 7, 2021, 11:01 AM IST

ఏపీలోని తుంగభద్ర నదిలో ఇసుక రవాణా సాగుతోంది. పీకల్లోతు నీటిలో సైతం ఎడ్లబండ్లతో ఇసుకను తరలిస్తున్నారు. వీరికి చిన్నారులు సాయం చేస్తున్నారు. ఏ మాత్రం పట్టుతప్పినా వారు నదిలో గల్లంతయ్యే ప్రమాదం ఉంది.

sand-transport-in-the-tungabhadra-river-at-kurnool
భద్రత మరిచి.. తుంగభద్రలోకి!

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు నగరం సమీపంలోని తుంగభద్ర నదిలో పీకల్లోతు నీటిలో ఎడ్లబండ్లతో ఇసుక తరలింపు సాగుతోంది. చిన్నారులు సైతం నది నీటిలో దిగి బండ్లను అదుపు చేస్తూ పెద్దలకు సాయం చేస్తున్నారు.

ఏమాత్రం పట్టుతప్పినా వారు నదిలో గల్లంతయ్యే ప్రమాదం ఉంది. కర్ఫ్యూ నేపథ్యంలో మధ్యాహ్నానికి పనులు ముగించాల్సి ఉన్నా.. వీరు మధ్యాహ్నం నుంచే ఇసుక తోడే పని ప్రారంభిస్తున్నారు.

ఇదీ చదవండి:Covid: 4 కేసుల్లో ఒకటి గ్రామీణ భారతంలోనే!

ABOUT THE AUTHOR

...view details