తెలంగాణ

telangana

మునుగోడుపై కేఏ పాల్ బాంబులు.. వెంటనే పారిపోండి: ఆర్జీవీ

By

Published : Nov 6, 2022, 7:28 PM IST

RGV SATIRICAL TWEETS ON KA PAUL: సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఆయన. ఇక తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేఏ పాల్ గురించి పలు ఆసక్తికర ట్వీట్స్ చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

RGV SATIRICAL TWEETS ON KA PAUL
RGV SATIRICAL TWEETS ON KA PAUL

RGV SATIRICAL TWEETS ON KA PAUL మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు వచ్చేశాయి. 10వేల ఓట్లకు పైగా మెజార్టీతో తెరాస అభ్యర్థి విజయకేతనం ఎగురవేశారు. ఇక భాజపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి నైతిక విజయం తనదేనని ప్రకటించారు. కాంగ్రెస్ అయితే ఈ ఉపఎన్నికలో డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. అయితే ఈ ఉపఎన్నికలో అభ్యర్థులు కాకుండా మరో స్పెషల్ అట్రాక్షన్‌గా కేఏ పాల్ నిలిచారు.

మునుగోడు ఉపఎన్నికలో కేఏ పాల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఓవైపు నవ్వులు పూయిస్తునే... మునుగోడు బైపోల్‌ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఎన్నిక రోజు సైతం 10వేళ్లకు 10 ఉంగరాలతో కనిపించి... పరుగులతో అందరికీ వినోదం పంచారు. ఇక ఈరోజు ప్రెస్‌మీట్‌లో బ్యాలెట్ పేపర్లు పెట్టి ఉంటే... లక్షకు పైగా ఓట్లు వచ్చేవని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం అధికారులు భాజపా, తెరాసకు తొత్తులుగా పనిచేశారని.. అందుకే తాను ఓడిపోయానని ఆరోపించారు.

అయితే గతంలో కేఏ పాల్ మునుగోడులో తనను గెలిపించకపోతే... బాంబు వేసి పేల్చేస్తా అని సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. మునుగోడు రిజల్ట్ వచ్చాక పాల్ గతంలో చేసిన కామెంట్లపై రాంగోపాల్ వర్మ పలు ఆసక్తికర ట్వీట్లు చేశారు. ''ఇప్పుడే కేఏపాల్ తన స్నేహితులైన ఐఎస్ఐఎస్, అల్​ ఖాయిదా సహాయం తీసుకుని మునుగోడు నియోజకవర్గం మీద బాంబులు వేయిస్తున్నాడని తెలిసింది. అక్కడివారు పారిపోవాలి'' అంతేకాక అతని శక్తి ఉపయోగించి ప్రభువుతో మునుగోడులో ఎలాంటి పంటలు పండకుండా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాడని వెల్లడించారు. ఒక దారుణమైన వైరస్ వచ్చి అక్కడ మనుషులు చనిపోయేలా చేయించబోతున్నాడని సెటైర్‌ వేశారు. ఇక్కడి నుంచి ఎలాగో తరిమేశారు... ఇక కేఏ పాల్ అమెరికన్ ప్రెసిడెంట్‌గా 2024లో పోటీ చేయడం బెటర్.. అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. అక్కడ అమెరికా ప్రెసిడెంట్‌గా గెలిచిన తర్వాత మునుగోడు నియోజకవర్గం మీద ఒక న్యూక్లియర్ బాంబు వేస్తాడని వర్మ పోస్ట్ చేశారు. రాం గోపాల్ వర్మ చేసిన ట్వీట్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details