తెలంగాణ

telangana

'నాయిని మృతి కార్మిక లోకానికి తీరని లోటు'

By

Published : Dec 17, 2020, 3:54 PM IST

రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి సేవలను కార్మిక లోకం ఎప్పటికీ మరచిపోదని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ సంతాపం వ్యక్తం చేసింది. ద.మ.రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాయిని మృతిపట్ల కార్మికులు సంతాపం వ్యక్తం చేశారు.

'నాయిని మృతి కార్మిక లోకానికి తీరనిలోటు'
'నాయిని మృతి కార్మిక లోకానికి తీరనిలోటు'

కార్మికులకు ఎంతో మేలు చేసిన రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి మరణం కార్మికలోకానికి తీరని లోటని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకుడు వెంకటేశ్వర్లు అన్నారు. నాయిని మృతికి సంతాపంగా ద.మ.రైల్వే మజ్దూర్​ యూనియన్​ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నివాళి అర్పించారు.

కార్మికుల సంక్షేమం కోసం నాయిని ఎంతో కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. సమస్యలు వచ్చినప్పుడు అండగా ఉండేవారన్నారు. కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసి... వారి హక్కులను కాపాడడంలో నాయిని కృషిని కొనియాడారు.

ఇదీ చూడండి:డ్రగ్స్ కేసుపై హైకోర్టు విచారణ 2వారాలకు వాయిదా

ABOUT THE AUTHOR

...view details