తెలంగాణ

telangana

Ayudha puja: ఆయుధ పూజలో పాల్గొన్న సీపీలు.. గాల్లోకి కాల్పులు జరిపిన మహేశ్​ భగవత్​

By

Published : Oct 13, 2021, 5:32 PM IST

weapon worship
weapon worship

దేవీ నవరాత్రి మహోత్సవాల (weapon worship) సందర్భంగా రాచకొండ, సైబరాబాద్​ సీపీలు మహేశ్​ భగవత్​, స్టీఫెన్​ రవీంద్ర ఆయుధ పూజ నిర్వహించారు (Ayudha puja). అనంతరం సీపీ మహేశ్​ భగవత్​ గాల్లోకి కాల్పులు జరిపారు.

దేవీ నవరాత్రి వేడుకల సందర్భంగా రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కమిషనర్లు ఆయుధ పూజ (Ayudha puja)నిర్వహించారు. ఆయుధ కారాగారంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆయుధ పూజలో పాల్గొన్న రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​

అంబర్​పేట్​లోని పోలీస్​ హెడ్​క్వార్టర్స్​లో రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ పూజలో పాల్గొన్నారు. అనంతరం తుపాకీతో ఒక రౌండ్​ గాల్లో కాల్చారు. సైబరాబాద్​ కమిషనరేట్​ ప్రాంగణంలో ఉన్న సీఏఆర్​ హెడ్​క్వార్టర్స్​లో (weapon worship)సీపీ స్టీఫెన్​ రవీంద్ర పూజలు నిర్వహించారు.

గాల్లోకి కాల్పులు జరుపుతున్న రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయ దశమి పండగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని సీపీలు మహేశ్​భగవత్​, స్టీఫెన్​ రవీంద్ర తెలిపారు.

ఆయుధ పూజలో పాల్గొన్న సైబరాబాద్​ సీపీ స్టీఫెన్​ రవీంద్ర

ఇదీచూడండి:Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడి దర్శనం

ABOUT THE AUTHOR

...view details