తెలంగాణ

telangana

'బీసీలు ఆర్థికంగా చితికిపోయారు.. రుణాలు ఇచ్చి ఆదుకోవాలి'

By

Published : Jun 11, 2021, 7:14 AM IST

బీసీ కార్పొరేషన్ రుణాలు వెంటనే మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కరోనా కారణంగా బీసీ కులాలు ఆర్థికంగా చితికిపోయాయని వాపోయారు. వారికి రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.

r. krishnaiah, bc corporations
ఆర్.కృష్ణయ్య, బీసీ సంఘాలు

రాష్ట్రంలోని బీసీ కులవృత్తులు, చేతి వృత్తులు చేసుకునే వారికి రుణాలు మంజూరు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. కార్పొరేషన్​లో పెండింగ్​లో ఉన్న ఐదు లక్షల దరఖాస్తులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నారాయణగూడలోని సంఘం కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

కరోనా నేపథ్యంలో బీసీ కులాలు ఆర్థికంగా చితికిపోయాయని... వెంటనే వారికి సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న 56 బీసీ కులాలకు ఏపీ తరహా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన 120 ప్రభుత్వ బీసీ జూనియర్ కాలేజీల్లో వెంటనే అడ్మిషన్లు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. బీసీ రుణాలు విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు.

ఇదీ చదవండి:uttam kumar: నేడు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్‌ పంపుల వద్ద కాంగ్రెస్​ నిరసనలు

ABOUT THE AUTHOR

...view details