తెలంగాణ

telangana

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

By

Published : Dec 26, 2022, 3:51 PM IST

Updated : Dec 26, 2022, 3:58 PM IST

President Murmu in Srisailam: శ్రీశైల మల్లన్నను భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. దేవస్థాన అర్చకులు ముర్ముకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

President Murmu in Srisailam
President Murmu in Srisailam

President Murmu in Srisailam: శ్రీశైల మల్లన్నను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదారాబాద్‌ చేరుకున్న ముర్ము.. అక్కడి నుంచి సున్నిపెంట చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో శ్రీశైలం చేరుకున్నారు. ఆలయం వద్ద రాష్ట్రపతికి .. మంత్రి రోజా, ఎంపీ బ్రహ్మానందరెడ్డి స్వాగతం పలికారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి స్వాగతం పలుకుతున్న మంత్రి రోజా

అర్చకులు పూర్ణకుంభంతో, ఆలయం లోపలికి ఆహ్వానించారు. రాష్ట్రపతితోపాటు.. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా మల్లన్న సేవలో పాల్గొన్నారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రసాద్ పథకం కింద వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం అక్కడి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని రాష్ట్రపతి సందర్శించారు. ఆ తరువాత శ్రీశైలం నుంచి హెలికాప్టర్​లో హైదరాబాద్​లోని హకీంపేట విమానాశ్రయానికి తిరుగు ప్రయాణమయ్యారు.

శ్రీశైల మల్లన్న దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఇవీ చదవండి:

Last Updated :Dec 26, 2022, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details