తెలంగాణ

telangana

మొదలైన ఆంక్షలు.. కొత్త జీవో ప్రకారం చంద్రబాబుకు నోటీసులు

By

Published : Jan 3, 2023, 5:26 PM IST

Updated : Jan 3, 2023, 5:38 PM IST

Chandrababu visit to Kuppam: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం నేత చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించిన సమాచారం ఇప్పటికే పోలీసులకు తెలిపినా.. కొత్తగా వెలువడిన జీవో నెంబర్ 1 ప్రకారం సభలు ఎక్కడ పెడుతున్నారో ముందస్తు సమాచారం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. పలమనేరు పోలీసులు కుప్పం తెదేపా నేతలకు నోటీసులు అందజేశారు.

Chandrababu
Chandrababu

Chandrababu visit to Kuppam: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం పర్యటనపై పోలీసుల ఆంక్షలు మొదలయ్యాయి. సభలు, రోడ్‌షోల నిర్వహణపై ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఉత్తర్వుల ఆధారంగా చంద్రబాబు పర్యటనపై పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపటి నుంచి మూడు రోజులపాటు సొంత నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటించే ప్రాంతాలపై ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు.

తెదేపా నేతలు బాబు పర్యటించే ప్రాంతాలకు సంబంధించిన సమాచారం పోలీసులకు ముందుగానే చేరింది. పర్యటనకు అనుమతి తీసుకోవాలని నేడు పలమనేరు పోలీసుల నుంచి కుప్పం తెదేపా నేతలకు నోటీసులు జారీచేశారు. రాష్ట్రం ప్రభుత్వం నిన్న తీసుకువచ్చిన జీవో నెంబర్ 1 ప్రకారం సభలు ఎక్కడ పెడుతున్నారో ముందస్తు సమాచారం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. పోలీసుల అనుమతి ఉన్న చోటనే సభలు, కార్యక్రమాలు నిర్వహించాలని పలమనేరు డీఎస్పీ నోటీసులో స్పష్టం చేశారు.

AP Govt Guidelines on Public Meetings: ఆంధ్రప్రదేశ్​లో రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్‌షోలపై ఆ రాష్ట్ర సర్కార్‌ మార్గదర్శకాలు జారీ చేసింది. గుంటూరు, కందుకూరు తొక్కిసలాట ఘటనల దృష్ట్యా హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్‌, పంచాయతీ రహదారులు, రోడ్డు మార్జిన్ల వద్ద పోలీసు యాక్టు నిబంధనలు వర్తింపజేశారు. ఆ ప్రాంతాల్లో రోడ్డుషోలు నిర్వహించకుండా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

రోడ్డుకు దూరంగా, ప్రజలకు ఇబ్బందిలేని ప్రత్యామ్నాయ ప్రదేశాలు గుర్తించాలని సూచించారు. సభలు, రోడ్డుషోలు నిర్వహించే రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయ ప్రదేశాల ఎంపికపై సూచనలు పంపారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించకుండా చూడాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇబ్బంది లేని ప్రదేశాల్లో సభల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.

ఇవీ చదవండి:

Last Updated :Jan 3, 2023, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details