తెలంగాణ

telangana

Plastic Usage: ప్లాస్టిక్ వాడకంతో క్యాన్సర్‌ ముప్పు.. నిజమెంత..?

By

Published : Apr 15, 2023, 12:47 PM IST

Plastic Usage Is Harmful To Health: ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వాడటం ఎక్కువైపోయింది. అయితే దానిని ఎంత తగ్గిస్తే.. అంత మేలంటున్నారు నిపుణులు. ప్లాస్టిక్ వాడటం వల్ల ఆరోగ్యానికి పెద్ద ముప్పే ఉంటుందంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇలా చేయాలంటున్నారు. అవేంటంటే..?

Plastic
Plastic

Plastic Usage Is Harmful To Health: ఈ రోజుల్లో ప్లాస్టిక్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఎలాంటి ఆహార పదార్థాలైనా ప్లాస్టిక్‌ ప్లేట్లు, ప్లాస్టిక్‌ కప్పులు, ప్లాస్టిక్‌ గ్లాసుల్లో ఎక్కువగా తీసుకుంటున్నాం. ఇలా ఎక్కువగా ప్లాస్టిక్‌ వస్తువుల్లో నిలువ ఉంచిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ వస్తుందని వింటుంటాం. అయితే ఇది నిజమేనా అని చాలా మందిలో సందేహాలు ఉంటాయి. అసలు ప్లాస్టిక్‌ వాడకానికి, క్యాన్సర్‌ రావడానికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయంపై నిపుణులు ఏమంటున్నారంటే..?

ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పుల వాడకం తగ్గిస్తే మేలు: ఈ మధ్యకాలంలో ఏ హోటల్‌కు వెళ్లినా.. జ్యూస్ సెంటర్లకు వెళ్లినా వారు ఇచ్చే పాత్రలు సరిగ్గా కడుగుతారో లేదో అనే భయంతో మనం యూజ్ అండ్ త్రో వాటిల్లో ఇవ్వమని అడుగుతుంటాం. అప్పటికి అది మనకు సంతృప్తిని ఇచ్చినా.. ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పుల్లో వేడి పదార్థాలను తీసుకోవడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్లాస్టిక్‌ వాడకం మరీ ఎక్కువైతే క్యాన్సర్‌ వచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు.

ప్లాస్టిక్‌ రసాయన సమ్మేళనాలు ముప్పే: ప్లాస్టిక్ తయారీకి సంబంధించిన పరిశ్రమలలో వాడే రసాయన సమ్మేళనాలు ప్లాస్టిక్‌, క్యాన్సర్‌ మధ్య ఉన్న సంబంధంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సమ్మేళనాలు గ్యాస్ రూపంలో బయటకు వచ్చి.. వాటిని పీల్చినప్పుడు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

వేడి వస్తువులను ప్లాస్టిక్ వస్తువుల్లో పెట్టకూడదు: ఇక మన రోజువారీ జీవితంలో ఫుడ్ గ్రేడ్ కాని ప్లాస్టిక్‌ వస్తువుల్లో వేడి పదార్థాలను ఎక్కువసేపు ఉంచుతాం. అలా ఉంచి వాటిని తీసుకున్నప్పుడు కొంత ప్లాస్టిక్‌ కరిగి జీర్ణ వ్యవస్థలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి, ఫుడ్ గ్రేడ్ కాని ప్లాస్టిక్‌ వస్తువుల్లో వేడి పదార్థాలను పెట్టటం మానేస్తే ఆరోగ్యానికి మంచిది. ఒవెన్‌లో పెట్టి వేడి చేయకపోవడం, చేసిన పదార్థాలను తినడం వల్ల ఆరోగ్యానికి హాని అంటున్నారు. అలాంటి వస్తువులను వాడకపోవడం మేలు అంటున్నారు నిపుణులు. అలాగే క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలను విడుదల చేసే పరిశ్రమలకు వీలైనంత దూరంగా ఉండటం వల్ల అన్ని రకాలుగా ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details