తెలంగాణ

telangana

ఎమ్మెల్యే అనుచరులు వీరంగం.. రిపోర్టర్‌ సెల్‌ఫోన్‌ లాక్కొని..

By

Published : Aug 1, 2022, 11:44 AM IST

MLA fallowers: ఏపీ చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని కాపుపల్లె గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వెంకటేగౌడ అనుచరులు వీరంగం సృష్టించారు. వార్తా సేకరణకు వెళ్లిన రిపోర్టర్‌ సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. ఎమ్మెల్యే అభిమానుల పేరిట 20 మంది హంగామా సృష్టించారు.

palamaneru MLA fallowers hulchal
palamaneru MLA fallowers hulchal

MLA fallowers: గ్రామంలోని పాఠశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనపు గదులు మంజూరు చేసింది. వాటిని ఆట స్థలంలో నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఆటస్థలం పోతే పిల్లలకు ఆడుకోవడానికి స్థలం ఉండదని గ్రామానికి చెందిన యువకులు అడ్డుకున్నారు. భవనాలను మరోచోట నిర్మించాలని కోరారు. ఆదివారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకి అదే విషయాన్ని విజ్ఞప్తి చేయాలని వచ్చారు.

అదే సమయంలో వార్తాసేకరణ కోసం వచ్చిన ‘ఈటీవీ’ రిపోర్టర్‌పై వైకాపా కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. ఈ కార్యక్రమాన్ని రికార్డు చేయొద్దని బెదిరిస్తూ సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. తాను కేవలం కార్యక్రమాన్ని రికార్డు చేస్తున్నానని చెబుతున్నా వినకుండా అందులో అప్పటికే రికార్డు చేసిన వీడియోలను దౌర్జన్యంగా డిలీట్‌ చేశారు. అది గమనించిన కొందరు సీనియర్‌ నాయకులు సెల్‌ఫోన్‌ ఇచ్చేయాలని చెప్పడంతో తిరిగిచ్చారు. ఎమ్మెల్యే అభిమానుల పేరిట 20 మంది హంగామా సృష్టించారు. సంఘటనపై స్పందిస్తూ.. ‘అదనపు గదులను గ్రామస్థులు కోరినచోటే నిర్మించాలని చెప్పి సమస్య పరిష్కరించాం. కొంతమంది గొడవ చేయాలని చూడగా ఈ సంఘటన చోటుచేసుకుంది. మా పార్టీవారు ఉద్దేశపూర్వకంగా సెల్‌ఫోన్‌ లాక్కోలేదు’ అని ఎమ్మెల్యే వెంకటేగౌడ వివరించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details