తెలంగాణ

telangana

Osmania Hospital Online OP Registration : ఉస్మానియాలో ఆన్​లైన్ ఓపీ.. 'ఈ సుస్రుత్​'లో పేషంట్​ వివరాలు

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2023, 10:30 PM IST

Updated : Sep 6, 2023, 10:54 PM IST

Hyderabad Osmania Hospital Online OP Registration : ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ స్లిప్​లకు కాలం చెల్లింది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్న ప్రభుత్వం ఈ సుస్రుత్ పోర్టల్​లో రోగుల వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేస్తున్నారు. దీనికి ఆధార్ లింక్ చేయటం ద్వారా రోగుల వివరాలను ఆన్​లైన్​లోనే వైద్యులకు అందించే సదుపాయం కల్పిస్తున్నారు. దీంతో పాటు రోగికి సంబంధించిన వైద్య రికార్డులు, రిపోర్టుల వివరాలు సైతం ఈ సుస్రుత్​కి అనుసంధానం చేస్తున్నారు. ఫలితంగా అతి తక్కువ సమయంలోనే రోగికి మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డిజిటల్ ఓపీ సేవలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

Online OP Registration
Hyderabad Osmania Hospital Online OP Registration

Hyderabad Osmania Hospital Online OP Registration :ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలంటే చాలు.. గంటల తరబడి ఓపీ కోసం వేచి చూడాలి. అది తీసుకున్నాక డాక్టర్ వద్దకు వెళ్లాలి. అక్కడ నుంచి మరో డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే మరల ఓపీ తీసుకోవాలి. ఒక నెల లేదా రెండు నెలల తర్వాత ఆసుపత్రికి వెళ్లిన మళ్లీ ఓపీ కోసం నిలబడాలి. ఇలా ఓపీ కోసమే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ప్రభుత్వాసుపత్రుల్లో మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఆ పరిస్థితికి చెక్ పడింది.

ప్రభుత్వం నూతనంగా ఆన్​లైన్ ఓపీలంటూ డిజిటల్ ఓపీలను(Online OP Registration) అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతానికి ఉస్మానియాఆసుపత్రి(Osmania General Hospital Hyderabad)లో ఈ నూతన పద్ధతిని అమలు చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే పేషంట్స్ ఆధార్ నంబర్​ను తీసుకొని వాటిని ఆన్​లైన్​ చేస్తూ.. 'ఈ సుస్రుత్'(e-Sushrut) పోర్టల్​లో ఆధార్ ఎంటర్​ చేసి వారి థంబ్​ తీసుకుంటున్నారు. ఫలింతంగా భవిష్యత్​లో ఓపీ కోసం వేచి చూడాల్సిన పని ఉండదని అధికారులు చెబుతున్నారు.

Hyderabad Area Hospitals Facilities : బస్తీ దవాఖానాల్లో 11 తర్వాతే పరీక్షలు.. ఇబ్బందులు పడుతున్న జనాలు

Online OP Registration in Osmania General Hospital Hyderabad :డిజిటలైజ్​ ప్రకారం స్టాటిస్టిక్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని ఉస్మానియా సూపరిడెంట్ డాక్టర్ నాగేంద్ర అన్నారు. నేషనల్ పోర్టల్​లో కూడా ఎంతమందికి సర్వీస్ చేస్తున్నాం.. ఎటువంటి సర్వీస్​ అందిస్తున్నామనేది తెలియడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. పేషంట్స్​కి సీఆర్ నంబర్ జనరేట్​ అయితే వారి వివరాల గురించి తెలుస్తుందని చెప్పారు. పేషంట్ ఇండియాలో ఏ ఆసుపత్రికి వెళ్లిన వారి ఆరోగ్య వివరాలు తెలుస్తుందన్న ఆయన.. దీని వలన పేషంట్​కి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు.

E-Sushrut Online OP Registration :పేషంట్​ పేరు, వయసు, సెక్స్, ఆధార్ నంబర్​తో ఆన్​లైన్​ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. దాదాపు నెల రోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. రోజుకి 2,400 నుంచి 2,300 వరకు రిజిస్ట్రేషన్​లు చేస్తున్నామని తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఆరు మోడ్యూల్స్​తో దీనిని మొదులుపెట్టామని చెప్పారు. ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ రిజిస్ట్రేషన్​, అలాగే ఓపీ చిట్స్​ని కూడా రిజిస్ట్రేషన్​ చేయడం జరుగుతుందన్నారు. ప్రిస్క్రిప్షన్(Prescription)​ కూడా అప్​లోడ్ చేస్తున్నామని పేర్కొన్నారు.

ఓపీ స్లిప్​ల కంటే.. అన్​లైన్ ఓపీ ఎక్కవ సమయం పడుతుంది : ఓపీ రిజిస్ట్రేషన్(OP Registration)​ ఇప్పుడు పూర్తిగా 100 శాతం చేస్తున్నామని అన్నారు. ఓపీ స్లిప్​ల కంటే ఈ ప్రొసెస్ కొంచెం ఎక్కువ సమయం పడుతుందన్న ఆయన.. దీని కోసం ప్రస్తుతానికి ఏడు కౌంటర్లు పెట్టామని.. పేషంట్స్​ని బట్టి వాటిని కూడా పెంచే మార్గం చేస్తామన్నారు. రెగ్యులర్​గా ఈ అన్​లైన్ ఓపీ అమలు చేస్తున్నట్లు వివరించారు. కొంత కాలంలో ఒక్క ఓపీతో మల్టీ స్పెషాలిటీగా కూడా చూపించుకోవచ్చని తెలిపారు. దీనికి సంబంధించి సాఫ్ట్​వేర్​ పనులు చేస్తున్నట్లు చెప్పారు.

అలాగే ఓపీ రిజిస్ట్రేషన్​లో అప్​లోడ్ చేయడానికి మెబైల్ కొనివ్వడం జరిగిందన్నారు. ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​ ద్వారా పేషంట్స్​కిఎలాంటి వైద్యం అవసరమో తెలుస్తుందని వివరించారు. తద్వారా పేషంట్స్​కి మెరుగైన వైద్యం అందించడానికి అస్కారం ఉంటుందన్నారు. ఈ ఆన్​లైన్ వలన పేషంట్స్​కి తిరిగే పని కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. దీంతో వైద్యుడికి కూడా వన్​ క్లీక్​తో ఎలాంటి డ్రగ్ పేషంట్​కి ఇవ్వాలనేది ఈజీగా తెలుస్తోందన్నారు. ఈ ఆన్​లైన్ సిస్టమ్​ ద్వారా అటు వైద్యులకు, ఇటు పేషంట్లకు సులువు అవుతుందని వివరించారు.

Osmania Hospital Online OP Registration ఉస్మానియాలో ఆన్​లైన్ ఓపీ ఈ సుస్రుత్​లో పేషంట్​ వివరాలు

NIMS Expansion : హైదరాబాద్‌ సిగలో మరో మణిహారం.. దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి భవంతి

Seasonal Diseases in Telangana : వాతావరణంలో మార్పులు.. జ్వరాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్న రోగులు

Last Updated :Sep 6, 2023, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details