తెలంగాణ

telangana

నిఖత్‌ జరీన్‌కు ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇవ్వాలి: రేవంత్‌రెడ్డి

By

Published : Jan 8, 2023, 10:37 PM IST

అర్జున్‌ అవార్డు గ్రహీత నిఖత్‌ జరీన్‌ను పీసీసీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. టీపీసీసీ తరఫున బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌కు రూ.5 లక్షల బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, అజారుద్దీన్‌, మధుయాష్కీ తదితరులు పాల్గొన్నారు.

TPCC awarded 5 lakhs to Nikhat Zareen
TPCC awarded 5 lakhs to Nikhat Zareen

బాక్సింగ్‌ ఛాంపియన్‌, అర్జున్‌ అవార్డు గ్రహీత నిఖత్‌ జరీన్‌ను పీసీసీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. హైదరాబాద్‌లోని నిజాం క్లబ్‌లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, మహేశ్‌కుమార్‌గౌడ్‌, అజారుద్దీన్‌, మధుయాష్కీ తదితరులు హాజరయ్యారు. పీసీసీ తరఫున నిఖత్‌ జరీన్‌కు రూ.5 లక్షల బహుమతి అందజేశారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నిజామాబాద్‌ నుంచి ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొని నిఖత్‌ జరీన్‌ దేశ గౌరవ ప్రతిష్ఠలు పెంచారన్నారు. సానియా మీర్జా తర్వాత నిఖత్‌ చొరవ చూపి క్రీడల్లో రాణించడం అభినందనీయమన్నారు. స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అమెకు స్థలం కేటాయించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించాలని, వారికి అవసరమైన ఆర్థిక సహకారం కూడా అందించాలన్నారు.

డీఎస్పీగా నిఖత్‌ జరీన్‌కు ఉద్యోగం ఇచ్చేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, జనవరి 26లోపు ఆమెకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్‌లో భారీ కార్యక్రమం ఏర్పాటు చేసి, అన్ని పాఠశాలల విద్యార్థులు వచ్చేలా చూడాలన్నారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని నింపేందుకు అందరూ కృషి చేయాలని రేవంత్‌రెడ్డి కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details