తెలంగాణ

telangana

రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు వర్షాలు

By

Published : Apr 22, 2021, 4:17 PM IST

రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వడగళ్లతో కూడిన వర్షం కురుస్తుందని.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

telangana weather report
తెలంగాణలో వర్షం, రాగల మూడు రోజులు వర్షం

రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

దక్షిణ తెలంగాణ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వడగళ్లతో కూడిన వర్షం కురవనున్నట్లు తెలిపింది. ఈరోజు ఉత్తర-తూర్పు ఉపరితల ఆవర్తనం దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఏర్పడిందని పేర్కొంది.

ఇదీ చూడండి: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు

ABOUT THE AUTHOR

...view details