తెలంగాణ

telangana

సాగర్ కుడి కాల్వ నుంచి ఐదు టీఎంసీల నీటిని తీసుకునేందుకు ఏపీకి కేఆర్​ఎంబీ గ్రీన్​సిగ్నల్

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2024, 12:12 PM IST

Nagarjuna Sagar Water Issue in Andhra Pradesh and Telangana : రెండు తెలుగు రాష్ట్రాల్లో నదీ జలాల పంపిణీలో కీలకంగా వ్యవహరిస్తోన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్​కు ఐదు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ బోర్డుకు ఇరు రాష్ట్రాలు ఇవ్వాల్సిన నిధులపై ఈ నెల 12వ తేదీన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనుంది.

Krishna River Management Board  Meeting
Nagarjuna Sagar Water Issue in AP and TS

Nagarjuna Sagar Water Issue in Andhra Pradesh and Telangana : నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి ఐదు టీఎంసీల నీటిని తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్​కు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి ఇచ్చింది. గత అక్టోబర్​లో ఏపీకి అనుమతించిన 45 టీఎంసీల కోటా నుంచే ఐదు టీఎంసీలను ఇస్తున్నట్లు తెలిపింది. రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్​లను సంప్రదించిన తర్వాత కేఆర్ఎంబీ నీటి విడుదల(KRMB Water Released) ఉత్తర్వులు జారీ చేసింది. అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇవ్వాల్సిన నిధుల విషయమై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 12వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో సమావేశం జరగనుంది.

నాగార్జునసాగర్‌ నిర్వహణ ఎవరిది? - తెలంగాణ, ఏపీల మధ్య తేలని పంచాయితీ

Krishna River Management Board Meeting : కృష్ణా బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.45.63 కోట్ల నిధులు వచ్చాయి. ఇప్పటి వరకు రూ.45.45 కోట్లు ఖర్చు చేశారు. అందులో ఏపీ ఇచ్చిన మొత్తం రూ.24.91 కోట్లు, తెలంగాణ ఇచ్చిన మొత్తం రూ.19.71 కోట్లు. కేంద్రం ఇచ్చిన కోటి రూపాయల కార్పస్ ఫండ్ కూడా ఇందులో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం వరకు తెలంగాణ రూ.13.61 కోట్లు, ఏపీ రూ.11.75 కోట్లు బోర్డుకు ఇవ్వాల్సి ఉంది. మే నెలలో ఏపీ ప్రభుత్వం రూ.3.35 కోట్లు ఇచ్చింది.

నాగార్జునసాగర్​ ఎడమ కాల్వ కింద పొలాలన్నీ ఎండుడే!

Financial Division of Krishna River Management : 2023-24 ఆర్థిక సంవత్సరానికి బోర్డు బడ్జెట్​ను రూ.23.5 కోట్లుగా ఖరారు చేశారు. అందులో వేతనాల కోసం చెల్లించాల్సిన మొత్తం రూ.12.7 కోట్లుగా ఉంది. అంటే నెలకు రూ.కోటికి పైగా వేతనాల కోసం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం బోర్డు వద్ద కేవలం రూ.22 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఆ మొత్తంతో జనవరి నెల వేతనాలను చెల్లించే పరిస్థితి లేదనికృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలిపింది. బోర్డుకు సకాలంలో నిధులు చెల్లించే అంశంపై 12వ తేదీన జరగనున్న సమావేశం(KRMB Next Meeting)లో చర్చించాలని ఎజెండాలో పొందుపరిచారు.

ఉద్రిక్త పరిస్థితికి ముగింపు - నాగార్జున సాగర్‌ డ్యాం వద్ద ఫెన్సింగ్, బారికేడ్లు తొలగింపు

Nagarjuna Sagar Water Issue Details : ఇటీవలే ఈ సాగర్​ జలాలపై వివాదం చోటు చేసుకుంది. ఏపీ పోలీసులు సరిహద్దులు దాటి వచ్చి తెలంగాణ పోలీసులపై దాడికి దిగారు. ఈ నేపథ్యంలో టీఎస్​ పోలీసులు కేసు పెట్టారు. అనంతరం కేంద్ర బలగాలు రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చాయి.

నాగార్జునసాగర్ వివాదం - మరోమారు తెరపైకి కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టు స్వాధీనం అంశం

ABOUT THE AUTHOR

...view details