తెలంగాణ

telangana

Mothkupalli Narsimhulu joins trs: అంబేడ్కర్‌కు నిజమైన వారసుడు కేసీఆర్: మోత్కుపల్లి నర్సింహులు

By

Published : Oct 18, 2021, 3:51 PM IST

Updated : Oct 18, 2021, 8:14 PM IST

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు(Mothkupalli Narsimhulu joins trs) గులాబీ గూటికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్, తెరాస నేతల సమక్షంలో తెలంగాణ భవన్​లో ఆయన పార్టీలో చేరారు.

Mothkupalli Narsimhulu joins trs
తెరాసలో చేరిన మోత్కుపల్లి

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు(Mothkupalli Narsimhulu joins trs) తెరాస తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్​లో సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు(Mothkupalli Narsimhulu joins trs) తదితరులు పాల్గొన్నారు.

మోత్కుపల్లికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్

అంతకు ముందుగా మోత్కుపల్లి(Mothkupalli Narsimhulu joins trs) ట్యాంక్​బండ్​పై ఉన్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బషీర్ బాగ్ కూడలిలోని మాజీ ఉప ఉపప్రధాని బాబు జగ్జీవన్ రాం విగ్రహం, గన్​పార్క్​లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి నేరుగా తెలంగాణ భవన్​కు బయలుదేరిన ఆయన తెరాసలో చేరారు.

తెదేపా నుంచి భాజపాకు

తెదేపా నుంచి భాజపాలో చేరిన మోత్కుపల్లి.. కొన్ని రోజుల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన అనుభవాన్ని, సుదీర్ఘ రాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకుని అయినా భాజపాలో సముచిత స్థానం కల్పించలేదని మోత్కుపల్లి గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం భాజపా కేంద్ర కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగానూ అవకాశం ఇవ్వలేదని ఆక్షేపించారు.

కేసీఆర్​పై పొగడ్తలు

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకున్నపుడు తనకు ఒక్కమాట కూడా అడగకపోవడం ఇబ్బందికి గురిచేసిందని మోత్కుపల్లి అన్నారు. సీఎం కేసీఆర్‌ నిర్వహించిన దళిత సాధికారత సమావేశంలో తన అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ఆహ్వానిస్తే బండి సంజయ్‌కు చెప్పే వెళ్లానని.. అయినా పార్టీలో భిన్నాభిప్రాయాలు రావడం తనను బాధించిందన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భాజపాకు రాజీనామా చేసిన్నట్లు అప్పట్లో మోత్కుపల్లి ప్రకటించారు. దేశంలోనే దళితులకు పది లక్షలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ఆయన కొనియాడారు. అంబేడ్కర్‌కు నిజమైన వారసుడు కేసీఆరేనని పేర్కొన్నారు. దళిత నేతలంతా కేసీఆర్‌కు మద్దతు తెలపాలని మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu)కోరిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి:Revanth reddy tweet: హైదరాబాద్​లో అక్రమ నిర్మాణాలపై రేవంత్ ట్వీట్.. కేటీఆర్​కు ట్యాగ్

Last Updated : Oct 18, 2021, 8:14 PM IST

ABOUT THE AUTHOR

...view details