తెలంగాణ

telangana

TRS President Election 2021: తెరాస అధ్యక్ష పదవికి కేసీఆర్ తరఫున మరిన్ని నామినేషన్లు

By

Published : Oct 18, 2021, 1:26 PM IST

Updated : Oct 18, 2021, 2:56 PM IST

తెరాస అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ(TRS President Election 2021 news) ఉత్సాహంగా సాగుతోంది. తెరాస అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్ తరఫున మరిన్ని నామినేషన్లు దాఖలయ్యాయి. సీఎం కేసీఆర్‌ పేరును ప్రతిపాదిస్తూ మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్‌పర్సన్లు, మేయర్లు నామినేషన్లు సమర్పించారు.

TRS President Election 2021, cm kcr
తెరాస అధ్యక్ష పదవికి ఎన్నికలు, సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా పార్టీ అధ్యక్షుడి(TRS President Election 2021 news)గా సీఎం కేసీఆర్​ను ప్రతిపాదిస్తూ మరిన్ని నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇప్పటికే పలువురు మంత్రులు నామినేషన్లు దాఖలు చేయగా... సీఎం కేసీఆర్‌ పేరును ప్రతిపాదిస్తూ మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్‌పర్సన్లు, మేయర్లు వేర్వేరుగా నామినేషన్లు సమర్పించారు. సీఎం కేసీఆర్​ను ప్రతిపాదిస్తూ మంత్రులు మహమూద్​ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్​, ఎర్రబెల్లి దయాకర్​ రావు, ఇంద్రకరణ్​ రెడ్డి, తలసాని శ్రీనివాస్​ యాదవ్, శ్రీనివాస్​ గౌడ్​, జగదీశ్​ రెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్​ కుమార్.. ప్రస్తుత రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులు, పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివాసరెడ్డికి నామినేషన్లు సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో సందడి నెలకొంది. ఆదివారం ఉదయం నుంచి కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటివరకు కేసీఆర్ తరఫున పది నామినేషన్లు దాఖలయ్యాయి.

తెరాస అధ్యక్ష పదవికి ఎన్నికలు, సీఎం కేసీఆర్

ప్రక్రియ వివరాలు

తెరాస రాష్ట్ర అధ్యక్షుడి(TRS President Election 2021) ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల అయింది. తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ ఎన్నికల అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి షెడ్యూల్​ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర అధ్యక్ష పదవికి(TRS President Election 2021 NEWS) ఆదివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 22 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 23న పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 24వ తేదీ తుది గడువుగా నిర్దారించారు. 25న హెచ్‌ఐసీసీలో(HICC NEWS) జరిగే పార్టీ సర్వసభ్య సమావేశంలో అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. అదేరోజు ప్రతినిధుల సభ (ప్లీనరీ) నిర్వహిస్తారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా తెరాస మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీ విభాగాల తరఫున విడివిడిగా పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు కేసీఆర్‌(TELANGANA CM KCR NEWS) పేరును ప్రతిపాదించి బలపరుస్తూ నామినేషన్లు వేయనున్నారు.

త్వరలో వరంగల్‌కు..

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి(TRS President Election 2021) ఎన్నిక తర్వాత ప్లీనరీ సమావేశాల్లో వివిధ అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. రెండు దశాబ్దాల్లో తెరాస, ఏడేళ్లలో తెరాస ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించేందుకు నవంబరు 15న వరంగల్​లో విజయ గర్జన పేరిట భారీ సభ నిర్వహించనున్నారు. తెరాస ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించ తలపెట్టిన విజయగర్జన భారీ బహిరంగ సభకు అనువైన స్థలాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్​కు నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం ముఖ్య నేతలతో చర్చించి వేదికను ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత సభ ఏర్పాట్ల పరిశీలనకు కేటీఆర్‌ వరంగల్‌ వెళతారని తెలుస్తోంది.

పార్టీ అధ్యక్షుడిగా ఇప్పటివరకు పార్టీ తరఫున ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేసినందున.... కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:Revanth reddy tweet: హైదరాబాద్​లో అక్రమ నిర్మాణాలపై రేవంత్ ట్వీట్.. కేటీఆర్​కు ట్యాగ్

Last Updated :Oct 18, 2021, 2:56 PM IST

ABOUT THE AUTHOR

...view details