తెలంగాణ

telangana

భారీ శబ్దంతో ఒక్కసారిగా ఆగిన ఎంఎంటీఎస్.. పరుగులు తీసిన ప్రయాణికులు

By

Published : Sep 30, 2022, 12:34 PM IST

Updated : Sep 30, 2022, 2:23 PM IST

హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు మార్గంలో ఎంఎంటీఎస్ రైలు ఇంజిన్​లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో ఆగిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సాంకేతిక లోపాన్ని సరిచేయడంతో రైలు ముందుకు కదిలింది.

mmts train
mmts train

హైదరాబాద్‌ బేగంపేట-నెక్లెస్‌ రోడ్డు మధ్య ఎంఎంటీఎస్ రైలు భారీ శబ్దంతో ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. కొందరు ప్రయాణికులు రైలులోంచి బయటకు దూకారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపం వల్ల రైలు ఒక్కసారిగా ఆగిపోయిందని రైల్వే సిబ్బంది తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సాంకేతిక లోపాన్ని సరిచేయడంతో రైలు ముందుకు కదిలింది. ఈఘటనలో ఎవరికి ఏమీ కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

భారీ శబ్దంతో ఒక్కసారిగా ఆగిన ఎంఎంటీఎస్.. పరుగులు తీసిన ప్రయాణికులు
Last Updated :Sep 30, 2022, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details