తెలంగాణ

telangana

సీఎం కేసీఆర్.. జగన్​ను చూసి నేర్చుకో: జీవన్​ రెడ్డి

By

Published : Feb 19, 2020, 1:19 PM IST

ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్యంతర భృతి ఇచ్చారని... తెలంగాణలో మాత్రం 20 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వలేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసులో చిన్నవాడైన జగన్​ను చూసి నేర్చుకోమంటూ కేసీఆర్​కు హితవు పలికారు.

mlc jeevan reddy fires on trs
'సీఎం కేసీఆర్.. చిన్న పిల్లగాన్ని చూసుకో నేర్చుకో..'

తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిన ప్రభుత్వ ఉద్వోగులను తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగులు వివక్షకు గురవుతున్నారని తెలిపారు. తెరాస హయాంలోకొచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ గ్రూప్​-1 నోటిఫికేషన్ వేయకపోవడం చాలా బాధకరమని తెలిపారు.

ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్యంతర భృతి ఇచ్చారని... ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఏపీలో ఉందని తెలిపారు. వయసులో చిన్నవాడైన జగన్​ను చూసి నేర్చుకోమంటూ సీఎం కేసీఆర్​ను విమర్శించారు. ఉద్యోగుల సంఘం నాయకుడు పేరు మీదే శ్రీనివాస్ గౌడ్​కు మంత్రి పదవి వచ్చిందని... ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగుల పక్షాన నిలబడకపోతె శ్రీనివాస్ గౌడ్​కు మంత్రి పదవెందుకంటూ ప్రశ్నించారు. శ్రీనివాస్ గౌడ్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని.. కేసీఆర్ ఇప్పటికైనా పీఆర్​సీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్.. జగన్​ను చూసి నేర్చుకో: జీవన్​ రెడ్డి

ఇవీ చూడండి:మియాపూర్‌లో హోటల్లోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details