తెలంగాణ

telangana

'పీసీసీ, సీఎల్పీ నాయకుల తీరును ఏఐసీసీ నిశితంగా గమనిస్తోంది'

By

Published : Dec 19, 2022, 8:35 PM IST

రాష్ట్రంలోని పీసీసీ, సీఎల్పీ నాయకుల తీరును ఏఐసీసీ నిశితంగా గమనిస్తోందని ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా పార్టీలో సీనియర్లను కోవర్టులు అనడం సరైంది కాదన్నారు. పార్టీలో ఏదైనా సమస్య ఉత్పన్నమైతే సమన్వయం చేయాల్సిన బాధ్యత ఏఐసీసీ కార్యదర్శులపై ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

'పీసీసీ, సీఎల్పీ నాయకుల తీరును ఏఐసీసీ నిశితంగా గమనిస్తోంది'
'పీసీసీ, సీఎల్పీ నాయకుల తీరును ఏఐసీసీ నిశితంగా గమనిస్తోంది'

ఆధారాలు లేకుండా పార్టీలో సీనియర్లను కోవర్టులు అనడం సరైంది కాదని ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. సీనియర్లు కోవర్టు గిరి చేసినా తప్పేనని అభిప్రాయపడ్డారు. పీసీసీ, సీఎల్పీ నాయకుల తీరును ఏఐసీసీ నిశితంగా గమనిస్తోందన్న ఆయన.. పార్టీ కోసం ఎవరేం చేశారో పిలిచి అడుగుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ సీఎల్పీ కార్యాలయంలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన శ్రీధర్‌ బాబు.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో అల్పాహార సమావేశానికి తననూ పిలిచారన్నారు. ఆ రోజు తాను బిజీగా ఉండటం వల్ల వెళ్లలేకపోయినట్లు వివరించారు.

పార్టీలో ఏదైనా సమస్య ఉత్పన్నమైతే సమన్వయం చేయాల్సిన బాధ్యత ఏఐసీసీ కార్యదర్శులపై ఉంటుందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఎంపీ ఉత్తమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవితపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగితే విచారణ జరిపిన పోలీసులు.. రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యేపై జరుగుతున్న ప్రచారంపైనా విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు తమకు తమకు అంతర్గత కలహాలు పెట్టడం సరైంది కాదని, తప్పొప్పులు ఉంటే బయటకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

ఆధారాలు లేకుండా సీనియర్లను కోవర్టులు అనడం తప్పు. సీనియర్లు కోవర్ట్‌ గిరి చేసినా తప్పే. పీసీసీ, సీఎల్పీ నాయకుల తీరును ఏఐసీసీ గమనిస్తోంది. భట్టి ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌కు నన్ను కూడా పిలిచారు. నేను బిజీగా ఉన్నందున వెళ్లలేకపోయాను. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై ఉత్తమ్ ఫిర్యాదు చేయాలి. పోలీసులు మాలో మాకే కలహాలు పెట్టడం సరైంది కాదు. -శ్రీధర్‌బాబు, మంథని ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details