తెలంగాణ

telangana

ఏపీలో అధికార పార్టీ బంధువు గ్రామ సచివాలయంలో వీరంగం

By

Published : Jan 19, 2023, 5:06 PM IST

MLA Relative Misbehave in Village Secretariat: ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి సచివాలయానికి వెళ్లి దురుసుగా ప్రవర్తించాడు. నేను ఎమ్మెల్యే బంధువంనంటూ అసభ్యపదజాలంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా.. నానా హంగామ చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

MLA Relative Misbehave in Village Secretariat
MLA Relative Misbehave in Village Secretariat

ఏపీలో అధికార పార్టీ బంధువు గ్రామ సచివాలయంలో వీరంగం

MLA Relative Misbehave in Village Secretariat: ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి సచివాలయంలో దురుసుగా ప్రవర్తించాడు. తన తల్లి పింఛన్​ ఎందుకు తొలగించారంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేను ఎమ్మెల్యే బంధువునంటూ నానా హంగామా సృష్టించాడు. కార్యాలయంలోని కుర్చీలను ఇష్టమొచ్చినట్లు విసిరేశాడు. సిబ్బంది చెప్పిన వినకుండా ఇష్టమొచ్చినట్లు చేశాడు.

అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువని సిబ్బంది చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు. ప్రభుత్వం ఇటీవల రద్ధు చేసిన పింఛన్లలో మార్కాపురం మండలం భూపతిపల్లి గ్రామంలో కూడా కొన్ని పింఛన్లు రద్దయ్యాయి. రద్దైన పింఛన్లలో సూరెడ్డి సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి తల్లి పింఛన్​ ఉంది. దీంతో ఆగ్రహనికి గురైన అతను సచివాలయానికి వచ్చి హల్​చల్​ చేశాడు.

నేను ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి బంధువుని అంటూ.. సచివాలయ సిబ్బందితో పింఛన్​ తొలగింపుపై దుర్భాషలాడాడు. అతని కుటుంబానికి సుమారు 22 ఎకరాల భూమి ఉందని అందుకే పింఛన్​ రద్దయిందని అధికారులు అంటున్నారు. చెప్పిన వినకుండా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించాడని వారు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details