తెలంగాణ

telangana

'మళ్లీ మళ్లీ బెదిరిస్తున్నారు.. డీజీపీ గారు యాక్షన్ తీసుకోండి'

By

Published : Feb 22, 2023, 5:09 PM IST

MLA Rajasingh letter to DGP: డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తనను చంపుతామని బెదిరింపు ఫోన్లు, సందేశాలు వస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. గతంలోనూ ఈ విషయం పోలీసుల దృష్టికి తెచ్చినా చర్యలు తీసుకోలేదని రాజాసింగ్ ఆరోపించారు. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందని ఆవేదన చెందారు. గన్ లైసెన్స్ కూడా ఇవ్వడం లేదని లేఖలో రాశారు.

MLA Rajasingh wrote to DGP regarding threatening calls
'మళ్లీ మళ్లీ బెదిరిస్తున్నారు.. డీజీపీ గారు యాక్షన్ తీసుకోండి'

MLA Rajasingh letter to DGP: తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ఇటీవల చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన డీజీపీ అంజనీకుమార్‌కు లేఖ రాశారు. తనకు ప్రాణహాని ఉందని.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ.. రాజాసింగ్.. డీజీపీ అంజనీకుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. గత కొన్ని నెలల నుంచి ఇలాంటి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ విషయం పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాజాసింగ్ ఆరోపించారు. తనతో పాటు, తన కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు ఆగంతకులు చెబుతున్నారని... రోజువారీ కార్యకలాపాలు గురించి చెబుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రాజాసింగ్ తెలిపారు. హైదరాబాద్‌లో స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయని... త్వరలో నీ అంతు చూస్తామంటూ ఫోన్లు చేస్తున్నారని... డీజీపీకి రాసిన లేఖలో రాజాసింగ్ పేర్కొన్నారు.

ఆగంతకులు ఉపయోగిస్తున్న ఫోన్ నెంబర్లు, సందేశాలను డీజీపీకి పంపించారు. తనకిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందని.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా... ఫలితం లేదని రాజాసింగ్ అన్నారు. గన్ లైసెన్స్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నా.. గతంలో నేరచరిత్ర ఉందని నిరాకరిస్తున్నారన్నారు. ఎంతో మంది నేరస్థులకు సైతం గన్ లైసెన్సులు ఇచ్చారని రాజాసింగ్ డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

అసలు జరగిన విషయం ఇది...హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన ట్విటర్ వేదికగా... తనకుబెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఇటీవల పోస్ట్ చేశారు. చంపుతామంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని ట్వీటారు. తనను చంపుతానని ఓ పాకిస్థానీ వాట్సాప్‌ కాల్‌లో బెదిరించినట్లు ఆవేదన చెందారు. ఇస్లాం మతాన్ని కించపరుస్తున్నందుకు తన గొంతు కోస్తామని బెదిరించినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తరచూ ఇలాంటి కాల్స్, మెసేజ్‌లు వస్తుంటాయని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details