తెలంగాణ

telangana

రాజాసింగ్‌ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్‌.. పాక్‌ నుంచేనట!

By

Published : Feb 20, 2023, 9:00 PM IST

Threatening calls to MLA Raja Singh: తనని చంపేస్తామంటూ బెదిరింప్ కాల్స్ వస్తున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఇస్లాం మతాన్ని కించపరిస్తే గొంతు కోస్తామంటూ బెదిరిస్తున్నారని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ప్రతిరోజూ ఇలాంటి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయన్న రాజాసింగ్‌... తన ట్వీట్​ను కేంద్రహోం మంత్రి, డీజీపీ, సీపీలకు ట్యాగ్‌ చేశారు.

MLA Rajasingh tweeted that he was receiving death threats
MLA Rajasingh tweeted that he was receiving death threats

Threatening calls to MLA Raja singh: బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడూ హిందూత్వ వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తూ ఉంటారు. పలుమార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కూడా అయ్యాయి. ఇప్పుడు వార్తల్లో ఉండే రాజాసింగ్.. తనను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు.

అసలు జరగిన విషయం ఇది...హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన ట్విటర్ వేదికగా... తనకుబెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. చంపుతామంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని రాజాసింగ్‌ ట్వీట్‌ చేశారు. సాయంత్రం 3:34 గంటలకు బెదిరింపు కాల్‌ వచ్చిందని రాజాసింగ్‌ పేర్కొన్నాడు. తనను చంపుతానని ఓ పాకిస్థానీ వాట్సాప్‌ కాల్‌లో బెదిరించినట్లు వెల్లడించారు. తమ స్లీపర్‌ సెల్స్‌ యాక్టివ్‌గా ఉన్నాయని బెదిరించినట్లు ట్వీట్ చేశారు. ప్రతిరోజూ ఇలాంటి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయన్న రాజాసింగ్‌... ఈ విషయాన్ని కేంద్రహోం మంత్రి, డీజీపీ, సీపీలకు ట్వీట్​ చేశారు.

Rajasingh Tweet: తాజాగా రాత్రి 8 గంటల సమయంలో మరో వాట్సప్ సందేశం పంపినట్లు రాజాసింగ్ తెలిపారు. ఇస్లాం మతాన్ని కించపరుస్తున్నందుకు తన గొంతు కోస్తామని బెదిరించినట్లు పేర్కొన్నాడు. తరచూ ఇలాంటి కాల్స్, మెసేజ్‌లు వస్తుంటాయని.. ఇవాళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేశారు.

గతంలో వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. దీనిపై కొన్ని రోజుల క్రితం హైకోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చింది. ఆయనపై పీడీ చట్టాన్ని కూడా రద్దు చేసింది. మరోవైపు తన ప్రాణాలకు ముప్పు ఉందని రాజాసింగ్ పలుమార్లు ఆరోపించారు. పోలీసులు తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూప్ వాహనం పదే పదే పాడవుతోందని ఫిర్యాదు చేశారు. ఇటీవలే ఆ వాహనాన్ని ప్రగతిభవన్ వద్ద వదిలేసి వెళ్లారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details