తెలంగాణ

telangana

TALASANI: మత్స్యకారుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ: మంత్రి శ్రీనివాస్​ యాదవ్

By

Published : Sep 11, 2021, 8:26 PM IST

మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పేర్కొన్నారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. హైదరాబాద్​లో జరిగిన మత్స్యకారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

TALASANI: 'మత్స్యకారులు అభివృద్ధి సాధించాలనేదే సీఎం కేసీఆర్​ సంకల్పం'
TALASANI: 'మత్స్యకారులు అభివృద్ధి సాధించాలనేదే సీఎం కేసీఆర్​ సంకల్పం'

రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో జరిగిన మత్స్యకారుల సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్​, పశు సంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ భూక్యా లచ్చినాయక్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై విస్తృతంగా చర్చించారు.

మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ స్పష్టం చేశారు. మత్స్యకారుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకే మత్స్యకారుల సమన్వయ కమిటీ జిల్లాల పర్యటన చేస్తుందని తెలిపారు. మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనేదే సీఎం కేసీఆర్​ సంకల్పమన్న మంత్రి.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. మత్స్యకారులు కలిసికట్టుగా ఉండి.. ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా అభివృద్ధి సాధించాలని సూచించారు.

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్​తో కేంద్రమంత్రి సింధియా భేటీ.. ఏఏ అంశాలు చర్చించారో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details