తెలంగాణ

telangana

ssc exams review: పదో తరగతి విద్యార్థులకు మోడల్​ పరీక్షలు: సబితా ఇంద్రారెడ్డి

By

Published : Feb 25, 2022, 11:49 AM IST

ssc exams review: పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఈవోలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. కరోనా కారణంగా పలు అవాంతరాలు ఎదురైనందున ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాజేంద్రనగర్ లోని గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో డీఈఓలు, ఇంజినీర్లతో మంత్రి సమావేశం నిర్వహించారు.

minister sabitha indra reddy review on ssc exams
పదో తరగతి పరీక్షలపై సమావేశం నిర్వహించిన మంత్రి

ssc exams review: పదో తరగతి పరీక్షల ఏర్పాట్లు మన ఊరు- మన బడి తదితర అంశాలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులు ఆయా శాఖల ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు.

విద్యార్థుల ప్రతిభ స్థాయిని బట్టి ప్రత్యేక తరగతులు, మోడల్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. సిలబస్ కుదింపు, పరీక్ష సమయం, ప్రశ్నపత్రంలో ఛాయిస్, ఐచ్ఛిక ప్రశ్నలు పెంపు వంటి వాటిపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని మంత్రి అధికారులకు సూచించారు.

మన ఊరు -మన బడి పై సమీక్ష

మన ఊరు మన బడి కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నాణ్యత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్కడా రాజీ పడవద్దని ఇంజినీర్లకు సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన కాలవ్యవధిలో పనులు పూర్తి చేయాలన్నారు. పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అందమైన రంగులతో తీర్చిదిద్దాలన్నారు.

తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు దేవసేన, తదితర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:JEE advanced exam schedule : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదల

ABOUT THE AUTHOR

...view details