తెలంగాణ

telangana

మహిళల భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా సఖీ కేంద్రాలు: సబితా

By

Published : Jan 5, 2023, 5:05 PM IST

CM KCR Special attention to safety of women: మహిళల రక్షణ కోసం సఖీ సెంటర్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సెంటర్లను ఏర్పాటు చేయడం అభినందనీయమనీ మంత్రి కొనియాడారు. నగరవ్యాప్తంగా మరన్ని కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె తెలిపారు. ఈ మేరకు 181 హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా మహిళలకు పోలీసు వ్యవస్థ మరింత చేరువవుతుందని పేర్కొన్నారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులున్నా ఈ కేంద్రాన్ని ఆశ్రయించోచ్చని ఆమె సూచించారు.

Sakhi centers for women safety
Sakhi centers for women safety

Sakhi centers for women safety: మహిళల రక్షణ కోసం సఖీ సెంటర్లను ఏర్పాటు చేయడం అభినందనీయమనీ, హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా మరన్ని కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో సఖీ వన్‌స్టాఫ్‌ సెంటర్ నూతన భవనాన్ని ఆమె ప్రారంభించారు. 181 హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా మహిళలకు పోలీసు వ్యవస్థ మరింత చేరువవుతుందని ఆమె పేర్కొన్నారు.

మహిళలకు ఎలాంటి ఇబ్బందులున్నా ఈ కేంద్రాన్ని ఆశ్రయించవచ్చని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల భద్రత కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా ప్రతి మహిళా వెనుక ఒక పోలీసు ఉన్నట్లు భద్రత కల్పించడం శుభపరిణామమని మంత్రి కొనియాడారు.

లైంగిక వేధింపులు గానీ, గృహహంస కనివ్వండి. ఎదైనా ఒక రక్షణ కవచం లాగా ఈరోజు సఖీ సెంటర్లు ఉండటం అనేది వాస్తవం. ముఖ్యమంత్రి ఎప్పుడు చెబుతూ ఉంటారు. అర్బన్ ఏరియాల్లో ఒక హైదరాబాద్​ని బేస్ చేసుకోని పనిచేయ్యొద్దు. హెచ్​ఎమ్​డీఏ ఏరియాలో ఉన్న ఏరియా అంతా బేస్ చేసుకోని హైదరాబాద్ లాగా టీచ్ చేయ్యాలి. జనాభా పెరుగుతోంది. సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వాళ్లకి ఎప్పుడు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఎప్పుడు చెబుతూ ఉంటారు. -సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి

మహిళల భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా సఖీ కేంద్రాలు: సబితా

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details