తెలంగాణ

telangana

Minister KTR America Tour Updates : కొనసాగుతోన్న కేటీఆర్ పెట్టుబడుల వేట.. సమావేశాలు, ఒప్పందాలతో మంత్రి ఫుల్​ బిజీ

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2023, 1:40 PM IST

Minister KTR America Tour Updates : అమెరికాలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. చికాగోలో మెడ్​టెక్ రంగానికి చెందిన ఎలైవ్​కోర్ సంస్థ ప్రతినిధులతో కేటీఆర్​ సమావేశమయ్యారు. రాష్ట్రంలో మెడ్ టెక్ రంగాన్ని.. మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. కేర్లాన్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రజత్ పురీని కలిసి రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

KTR Chicago Visit Updates
Minister KTR America Tour Updates

Minister KTR America Tour Updates Today : కేటీఆర్​ అమెరికా(KTR US Tour) పర్యటన దిగ్విజయంగా సాగుతోంది. మెడ్​టెక్‌ రంగానికి చెందిన సంస్థ ఎలైవ్‌కోర్‌ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న అవకాశాలను.. సంస్థ ప్రతినిధులకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో మెడ్​టెక్‌ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సంస్థ సభ్యులతో చర్చించామని మంత్రి కేటిఆర్‌ తెలిపారు.

KTR Chicago Visit Updates :ప్రపంచ స్థాయి అగ్రి ప్రాసెసింగ్ సంస్థలలో ఒకటి అయిన.. ఆర్చర్‌ డానియల్స్‌ మిడ్‌ల్యాండ్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ విక్రమ్‌ లుథార్‌తో.. కేటీఆర్​ సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధిపై వారికి వివరించినట్లు తెలిపారు. వ్యవసాయ వస్తువుల ఎగుమతులు, ప్రాసెసింగ్ సౌకర్యాల స్థాపన, బయో-తయారీపై అత్యాధునిక ఆర్‌ అండ్‌ డీ నిర్వహించడం వంటి వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సహకారం అందించిందని ఆయనకు వివరించినట్లు తెలిపారు.

చికాగో ఇల్లినాయిస్ స్టేట్ డిప్యూటీ గవర్నర్ క్రిస్టీ జార్జ్, చికాగో వాణిజ్య కార్యదర్శి క్రిస్టిన్ రిచర్డ్స్ తదితరులతో కేటీఆర్​ సమావేశమయ్యారు. క్లీన్‌ టెక్‌, సస్టెయినబుల్​ మెుబిలిటీ, లైఫ్‌ సైన్సెస్‌, ఏవియేషన్‌ వంటి రంగాల్లో సహకారలపై ఇరువురు చర్చించుకున్నట్లు మంత్రి తెలిపారు. చికాగో బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ డీన్‌ మాధవ్‌ రాజన్‌తో సమావేశమయ్యారు. ఈ మేరకు భారత్‌ అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరిచే దిశగా చర్చలు జరిపినట్లు మంత్రి కేటిఆర్‌ తెలిపారు.

American Companies Investments in Telangana :తెలంగాణ మోడల్‌, 3 ఐ మంత్రా ఆఫ్‌ ఇన్నోవేషన్‌ గురించి డీన్‌ మాధవ్‌ రాజన్‌తో చర్చించినట్లు తెలిపారు. చికాగో బూత్‌ స్కూల్‌, హైదరాబాద్‌ ఐఎస్‌బి మధ్య ఎక్స్ఛేంజ్​ ప్రోగ్రామ్స్‌ నిర్వహించే ఆలోచన చేయాలని కోరినట్లు మంత్రి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దూసుకుపోతున్న సప్లై చైన్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ హైదరాబాద్‌లో ఆర్‌ అండ్‌ డి సేవలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటిఆర్‌ను కలిసిన ఓ9 సంస్థ ప్రతినిధులు.. వచ్చే రెండు సంవత్సరాలలో వెయ్యి మందికి ఉపాధి కల్పించినున్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు.

రాష్ట్రంలో హెల్త్‌ టెక్‌ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు..కేర్లాన్‌ సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రజత్‌ పురీతో కేటీఆర్​ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఐటీ, పరిశ్రమల అభివృద్ధిపై చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలో టైర్‌ 2 నగరాల్లో కూడా తమ ఉనికిని చాటుకునేందుకు కేర్లాన్‌ సంస్థను కోరినట్లు మంత్రి కేటిఆర్‌ తెలిపారు.

Goldman Sachs To Invest In Telangana : రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్న గోల్డ్​మెన్​ సాచ్

ABOUT THE AUTHOR

...view details