తెలంగాణ

telangana

Harish Rao on haritha nidhi: ఏప్రిల్​ నుంచే అమల్లోకి హరితనిధి: హరీశ్​రావు

By

Published : Mar 14, 2022, 5:20 PM IST

Harish Rao on haritha nidhi: హరిత నిధి అంశంపై అంసెబ్లీ కమిటీ హాల్​లో సంబంధిత అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు హరితనిధి ఏర్పాటు చేశామని తెలిపారు.

Minister Haritha Rao review on haritha nidhi
రాష్ట్రంలో పచ్చదనం పెంపు కోసం హరితనిధి: హరీశ్​రావు

Harish Rao on haritha nidhi:

రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు... ఏర్పాటు చేసిన హరిత నిధితో దేశంలోనే మిగిలిన రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హరిత నిధి అంశంపై అసెంబ్లీ కమిటీ హాల్​లో... మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సంబంధిత అధికారులతో హరీశ్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు.

హరిత తెలంగాణ సాధనలో సమాజంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం... విరాళాల రూపంలో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిధి ఏర్పాటు చేస్తూ... ఉత్తర్వులు జారీ చేసిందని హరీశ్‌ పేర్కొన్నారు. ఏప్రిల్ నెల జీతాల నుంచి ఈ విరాళాల జమ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల ఏప్రిల్ నెల జీతాల నుంచి కొద్ది మొత్తం హరితనిధికి జమ చేయనున్నట్లు... హరీశ్‌ పేర్కొన్నారు. ఇందుకు సంబంధిత శాఖలు అంతర్గత ఉత్తర్వుల ద్వారా పనిని ప్రారంభించాలని.... ఆదేశించారు.

'' రాష్ట్రంలో పచ్చదనం పెంపు కోసం హరితనిధి ఏర్పాటు చేస్తున్నాం. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి హరిత నిధి రానుంది. ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల జీతాల నుంచి హరితనిధికి విరాళాలు సేకరిస్తున్నాం. మే నెల నుంచి ఉద్యోగుల జీతాల నుంచి విరాళాలు సేకరణ జరుగుతోంది. హరితనిధి ఏర్పాటు ఇదో చరిత్రాత్మకం. జమ అయ్యే నిధులతో నర్సరీలు ఏర్పాటు, మొక్కల పెంపకం చేపడుతాం. సీఎం హరిత సంకల్పాన్ని విజయవంతం చేయాలి. పచ్చదనం పెంపులో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాం.''

---- మంత్రి హరీశ్‌రావు

ఇదీచూడండి:'ప్రధాని మోదీ పవర్​ఫుల్ లీడర్​.. కానీ'

ABOUT THE AUTHOR

...view details