తెలంగాణ

telangana

సివిల్స్ ర్యాంకర్లను సన్మానించి.. అల్పాహార విందిచ్చిన హరీశ్​రావు

By

Published : Jun 1, 2022, 12:13 PM IST

Harish Rao Honoring Civils Rankers: సివిల్స్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన తెలుగు వారిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు సన్మానించారు. వారికి తన నివాసంలో అల్పాహారం విందు ఇచ్చారు.

harish
harish

సివిల్స్ ర్యాంకర్లను సన్మానించి.. అల్పాహార విందిచ్చిన హరీశ్​రావు

Harish Rao Honoring Civils Rankers: సివిల్స్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విజేతలను ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సన్మానించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. సీఎస్​బీ- ఐఏఎస్​ అకాడమీ డైరెక్టర్, మెంటార్ మల్లవరపు బాల లత నేతృత్వంలో ర్యాంకర్లు హరీశ్‌రావును కలిశారు. 69వ ర్యాంకర్ గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి, 136వ ర్యాంకర్ అరుగుల స్నేహ, 161 ర్యాంకర్ బొక్కా చైతన్యరెడ్డి, 574వ ర్యాంకర్ రంజిత్ కుమార్, 676వ ర్యాంకర్ బి. స్మరణ్ రాజ్‌ను హరీశ్‌రావు సత్కరించారు.

సివిల్స్ పరీక్షల్లో ర్యాంకులు సాధించడం ద్వారా తెలుగు ప్రజలందరికీ గర్వకారణంగా నిలిచారని హరీశ్ రావు వారిని అభినందించారు. స్వయంగా ఐఏఎస్​ అయిన బాల లత హైదరాబాద్‌లో శిక్షణా సంస్థ ఏర్పాటు చేసి ఇప్పటివరకు వందమందికపైగా సివిల్స్ విజేతలను తీర్చిదిద్దడం గర్వకారణమని కొనియాడారు. సీఎస్​బీ అకాడమీ నుంచి భవిష్యత్తులో మరింత మంది విజేతలు రావాలని, దేశానికి అత్యున్నత సేవలు అందించాలని హరీశ్​రావు ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details