తెలంగాణ

telangana

అన్యాయం జరిగితే మౌనంగా ఉండను: ఈటల రాజేందర్​

By

Published : Feb 1, 2021, 10:52 PM IST

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్​ జిల్లా చల్లూరులో రైతు వేదిక సభలో పాల్గొన్న మంత్రి... రైతు బంధు పథకంలో మార్పులు చేయాలని వ్యాఖ్యానించారు. ఏ పదవిలో ఉన్నా... రైతులకు మాత్రం అండగా ఉంటానని ఉద్ఘాటించారు.

minister etela rajender interesting comments on raithu bandhu scheme
minister etela rajender interesting comments on raithu bandhu scheme

అన్యాయం జరిగితే మౌనంగా ఉండను

ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనసాగించాల్సిందేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కోరారు. కరీంనగర్ జిల్లా చల్లూరులో రైతు వేదిక ప్రారంభోత్సవం అనంతరం రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్నచర్యలు గుర్తు చేశారు. రైతు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాల్సిందేనని తేల్చి చెప్పిన ఈటల... రైతు బంధు పథకంలో కొన్ని మార్పులు చేయాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు తెలిపారు.

ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, పెద్దపెద్ద వ్యాపారాలు చేస్తున్నవారితో పాటు రాళ్లు, గుట్టలు ఉన్న భూములను రైతుబంధు పథకం నుంచి మినహాయించాలని కోరతామన్నారు. రైతులకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితిలోను మౌనంగా ఉండబోనన్న ఈటల... ఏ పదవిలో ఉన్నా కర్షకులకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. తాను ఆత్మగౌరవాన్ని ఎప్పుడు తాకట్టు పెట్టలేదని మంత్రి ఉద్వేగంగా మాట్లాడారు.

ఇదీ చూడండి: 'అమరులకు నివాళులర్పించే సంప్రదాయం తెచ్చేలా స్మారకం'

ABOUT THE AUTHOR

...view details