తెలంగాణ

telangana

ఉద్యోగులకు అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పుండాలి.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

By

Published : Nov 28, 2022, 12:19 PM IST

Minister Botsa controversial comments: ఉద్యోగులు అన్నాక ఎన్నో కోరికలు ఉంటాయని ప్రభుత్వం వాటిని తీర్చడం కష్టమని ఆంధ్రప్రదేశ్​ మంత్రి బొత్స సత్యానారయణ అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన జనసభలో మాట్లాడిన ఆయన.. ఉద్యోగుల సర్వీసు రూల్స్ , పదోన్నతులు, తదితర అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. సమస్యల పరిష్కారంలో సామ, దాన, భేద దండోపాయాలు సహజమేనని వ్యాఖ్యనించిన ఆయన.. ఉద్యోగ సంఘాలు నేరుగా దండోపాయానికి వెళ్లడం సరికాదని చెప్పారు.

Botsa Satyanarayana
Botsa Satyanarayana

'అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పు ఉద్యోగులకు ఉండాలి'

Minister Botsa controversial comments: ఉద్యోగులన్నాక ఎన్నో కోరికలు ఉంటాయని.. వాటిని ప్రభుత్వం తీర్చలేదంటూ.. ఆందోళన బాట పట్టడం సరికాదని.. ఆంధ్రప్రదేశ్​ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఉద్యోగులకు సూచించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి ప్రథమ మహా జనసభకు.. మంత్రి ఆదిమూలపు సురేష్​తో కలిసి ఆయన హాజరయ్యారు. అవసరమైతే కాళ్లు పట్టుకునైనా సమస్య పరిష్కరించుకునే నేర్పు ఉద్యోగ సంఘాలకు ఉండాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

సమస్యల పరిష్కారంలో సామ, దాన, భేద దండోపాయాలు సహజమేనన్న ఆయన.. ఉద్యోగ సంఘాలు నేరుగా దండోపాయానికి వెళ్లడం సరికాదన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సమస్యలు ఆర్థికంగా భారం కాదని ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు ప్రభుత్వానికి సూచించగా.. ఐతే అన్నీ ఒకేసారి చేయలేమని మంత్రి తేల్చి చెప్పారు. రోడ్ మ్యాప్ ప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

ఎనర్జీ కార్యదర్శులు, మహిళా పోలీసులు , శానిటేషన్ కార్యదర్శులు లకు సర్వీసు రూల్స్ సహా బాధ్యతల అప్పగింత విషయమై స్పష్టత లేదన్న మంత్రి ఆదిమూలపు సురేష్ వీటన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామన్నారు. శానిటేషన్ సిబ్బందికి వీక్లీఆఫ్ విషయమై త్వరలో మంచి వార్త చెబుతామన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీసు రూల్స్ ఇవ్వడం సహా పదోన్నతులూ కల్పిస్తామన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details