తెలంగాణ

telangana

సమరయోధుల త్యాగాలను ప్రతీ ఒక్కరు స్మరించుకోవాలి

By

Published : Aug 15, 2022, 2:37 PM IST

MARGADARSI MD SAILAJA KIRAN స్వరాజ్యం సముపార్జించుకుని 75 ఏళ్లు గడిచిన తరుణంలో ఆనాటి సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందని మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ​ శైలజాకిరణ్‌ తెలిపారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో సాధించిన విజయాలను, ప్రగతిని చూసి గర్విస్తూ పేదరికం, నిరక్షరాస్యత, ఇతర అసమానతలు, సవాళ్లను సమైక్యంగా కలిసి కట్టుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

margadarsi
సమరయోధుల త్యాగాలను ప్రతీ ఒక్కరు స్మరించుకోవాలి

MARGADARSI MD ప్రతిపౌరుడు సమాజానికి తనవంతుగా ఎంతోకొంత సేవ చేయాలనే ఆలోచనతో ముందడుగు వేసినప్పుడే నిజమైన స్వాతంత్య్ర ఫలాలను అందుకోగలమని మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజింగ్‌ డైరెక్టర్​ శైలజాకిరణ్‌ అన్నారు. స్వరాజ్యం సముపార్జించుకుని 75 ఏళ్లు గడిచిన తరుణంలో ఆనాటి సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో సాధించిన విజయాలను, ప్రగతిని చూసి గర్విస్తూ పేదరికం, నిరక్షరాస్యత, ఇతర అసమానతలు, సవాళ్లను సమైక్యంగా కలిసి కట్టుగా ఎదుర్కొనేందుకు.. తప్పులు జరిగినప్పుడు నిర్భయంగా వాటిపై మాట్లాడేందుకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకునేందుకు అంతా సమష్టిగా సాగాలని అభిలాషించారు. విజయవాడలోని సిద్దార్ధ మహిళా కళాశాల ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆమె ఎగురవేశారు. అనంతరం విద్యార్ధినుల గౌరవవందనం స్వీకరించారు.

ఆఫ్రికా, అరేబియాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నియంతృత్వ పోకడలు కనిపిస్తున్నాయని.. అభివృద్ధి చెందిన హాంకాంగ్‌లో సైతం అక్కడి ప్రజలు స్వాతంత్రం కోసం ఇప్పుడు పోరాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. మన దేశంలో ప్రతిపౌరునికి వాక్‌ స్వాతంత్య్రం హక్కును రాజ్యాంగం కలిపించిందన్నారు. అన్నీ ప్రభుత్వమో లేదా ఇంకెవరో చేయాలి .. వాటి ఫలాలు, ఫలితాలు మాత్రం మనం పొందాలనే ఆలోచన సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలని.. సామాజిక బాధ్యత, సమష్టితత్వం అలవడాలని సూచించారు. అప్పుడే మనం సాధించిన స్వాతంత్య్రాన్ని సద్వినియోగం చేసుకోగలమని తెలిపారు. స్వాతంత్య్రం అంటే సరైన పరిపాలనతో సమాజం అభివృద్ధి చెందడమని.. ఇందుకు మంచి విద్య, ఆరోగ్యం, నివాస వసతులు కలిగి ఉండాలన్నారు. 50 ఏళ్లతో పోలిస్తే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని.. ఇంకా సాధించాల్సింది చాలా ఉందన్నారు. ఆంగ్లేయులు మన దేశం నుంచి వనరులు, పుస్తకాలు, సంపదను కొల్లగొట్టి తీసుకెళ్లారని.. ప్రజలు, నాయకుల త్యాగాలు, చిత్తశుద్ధి, అంకితభావంతో దేశానికి స్వరాజ్యాన్ని సాధించారని.. దాన్ని మరింత కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details