తెలంగాణ

telangana

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాగల రెండు రోజులు బీ అలర్ట్..!

By

Published : Jan 28, 2023, 6:39 PM IST

Weather Report Today: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి తోడుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు పేర్కొంది. ఈ కారణంగా రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతంలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Weather Report
Weather Report

Weather Report Today: హిందూ మహా సముద్రాన్ని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం తెలియచేసింది. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టుగా వెల్లడించింది. అల్పపీడన ప్రాంతం రాగల 24 గంటల్లో మరింతగా బలపడుతుందని తెలియచేసింది. ఇది క్రమంగా వాయువ్య దిశగా కదులుతూ జనవరి 31 తేదీ నాటికి మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని స్పష్టం చేసింది. అలాగే ఫిబ్రవరి 1 తేదీ నాటికి శ్రీలంక, ఆగ్నేయ బంగాళాఖాతానికి దగ్గరగా వచ్చే అవకాశముందని తెలిపింది.

అల్పపీడన ప్రభావంతో జనవరి 31 తేదీ నుంచి శ్రీలంక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మరోవైపు రాగల 2 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పూర్తిగా పొడివాతావరణం నెలకొంటుందని అమరావతిలోని వాతావరణ విభాగం తెలియచేసింది. ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా ఈశాన్య, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని.. కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పొగమంచు కమ్ముకుంటుందని వాతావరణ విభాగం తెలిపింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details