తెలంగాణ

telangana

రాగల మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం

By

Published : May 7, 2021, 1:45 PM IST

ఉత్తర కర్ణాటక దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో రాగల మూడ్రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది.

light-to-moderate-rain-for-three-days
రాగల మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం

రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ, రేపు ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

ఉత్తర కర్ణాటక దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉత్తర కర్ణాటక.. దాని పరిసర ప్రాంతాల నుంచి ఉత్తర కేరళ వరకు సముద్ర మట్టానికి 0.9కిలో మీటర్ల ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని వివరించారు.

ఇదీ చూడండి:నెగెటివ్‌ వచ్చినా.. పాలసీ కోసం వేచి చూడాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details