తెలంగాణ

telangana

tg corona: రాష్ట్రంలో కొత్తగా 696 కరోనా కేసులు, 6మరణాలు

By

Published : Jul 12, 2021, 8:45 PM IST

రాష్ట్రంలో కరోనా (corona) రికవరీ రేటు 97.80 శాతానికి చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 696 కేసులు నమోదయ్యాయి. దీంతో మెుత్తం కేసుల సంఖ్య 6,32,379కి చేరింది. ఇవాళ మరో ఆరుగురు మరణించగా మెుత్తం మరణాల సంఖ్య 3,735కి ఎగబాకింది.

ts corona
ts corona

తెలంగాణలో కరోనా (corona) తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 1,05,797 నమూనాలను పరీక్షించగా..696 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,32,379కి చేరింది. తాజాగా కరోనా మహమ్మారితో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 3,735కి పెరిగింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 10,148 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇవాళ 858 మంది కరోనా నుంచి కోలు కొని డిశ్ఛార్జి అయినట్లు తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 68 మందికి పాజిటివ్‌గా తేలింది. 15 జిల్లాల్లో కేసులు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి:కరోనా మూడో దశపై ఐఎంఏ కీలక హెచ్చరికలు

ABOUT THE AUTHOR

...view details