తెలంగాణ

telangana

ప్రజల హక్కుల కోసం పోరాడే ఏకైక టీమ్ బీఆర్ఎస్ : కేటీఆర్

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2023, 9:48 AM IST

Updated : Nov 8, 2023, 10:24 AM IST

KTR Fires on PM Modi Statements in BC Public Meeting : బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల టీమ్‌ అని.. కాంగ్రెస్‌, బీజేపీకి కాదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్వీట్‌ చేసిన ఆయన.. రాహుల్‌ గాంధీ వచ్చి బీఆర్ఎస్-- బీజేపీకి బీ టీమ్ అంటారని.. ప్రధాని మోదీ వచ్చి కాంగ్రెస్‌కు సీ టీమ్ అంటారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్, బీజేపీకు బీ టీమ్‌ కాదని, కాంగ్రెస్‌కు సీ టీమ్‌ కాదని ముమ్మాటికి తెలంగాణ టీమ్‌ అని పేర్కొన్నారు.

PM Modi Speech
KTR Fires on PM Modi Speech

KTR Fires on PM Modi Statements in BC Public Meeting : 'తెలంగాణలో 'బీసీని ముఖ్యమంత్రి చేస్తాం''.. రాష్ట్ర ఓటర్లకు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ఇచ్చిన మాట ఇది. కేంద్రంలోని బీజేపీలో ప్రధాని నరేంద్రమోదీ తర్వాత అంతటి ప్రాధాన్యమున్న నేతగా చెప్పుకొనే అమిత్ షా నోటి నుంచి వచ్చిన ఈ మాట తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. దీనిపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా మాట్లాడుతుంటే.. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు మాత్రం బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్​లో నిర్వహించిన బీసీ ఆత్మీయ సభలో మరోసారి బీసీ సీఎం నినాదాన్ని ప్రధాని మోదీ పునరుద్ఘాటించడంతో బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు.

'రాష్ట్రానికి రాహుల్ ​గాంధీ వచ్చి బీఆర్ఎస్ పార్టీ.. బీజేపీకి బీ టీమ్ అంటారు.. ప్రధానమంత్రి మోదీ వచ్చి.. తాము కాంగ్రెస్​కు సీ టీమ్ అంటారు.. మేము బీజేపీకి బీ టీమ్ కాదు, కాంగ్రెస్​కు సీ టీమ్ కాదు' అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తమది ముమ్మాటికీ టీ టీమ్.. తెలంగాణ టీమ్ అని ఎక్స్(ట్విటర్)లో వివరించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఎవరితోనైనా ఎక్కడి దాకైనా పోరాడే ఏకైక టీమ్ బీఆర్ఎస్ పార్టీదే అని తెలిపారు. నిన్నటి దాకా మత రాజకీయం చేశారని.. ఇక ఇప్పుడు కుల రాజకీయానికి తెర తీశారని ప్రధాని నరేంద్ర మోదీపై కేటీఆర్ విరుచుకుపడ్డారు.

KTR Tweet on PM Modi Speech :పదేళ్ల బీజేపీ హయాంలో దేశంలోని బీసీలకు మిగిలింది వేదన మాత్రమేనని కేటీఆర్ విమర్శించారు. బీసీల జనగణన కూడా చేయని పాలన బీజేపీది అని.. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను పెట్టని ప్రభుత్వం.. బీజేపీ ప్రభుత్వం అంటూ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. అందుకే బీజేపీ ముమ్మాటికీ బీసీల వ్యతిరేక పార్టీయేనని ఆయన అన్నారు. బీసీలంటే ఆ పార్టీ దృష్టిలో బలహీనవర్గాలు.. కానీ, తమకు బీసీలంటే బలమైన వర్గాలని ప్రధానిమంత్రికి తెలియదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బీసీలకు పదవులే కాదు.. అనేక పథకాలిచ్చిన సర్కార్ బీఆర్ఎస్​ది అని వివరించారు.

'దిల్లీ దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా'

టీఎస్​పీఎస్సీ పేపర్లు లీక్ చేసిందే బీజేపీ నేతలని.. నిందితులతో వేదిక పంచుకుని తమపై నిందలు వేయడం ఆశ్చర్యం కలిగిస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో కాంగ్రెస్​నే బీజేపీ ప్రభుత్వం మించిపోయిందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఒక్కసారి కూడా రైతుల కోసం రుణమాఫీ చేయలేదని అన్నారు. రెండుసార్లు రైతులకు రుణామాఫీ చేసిన బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు చేయడం నిజంగా విడ్డూరంగా ఉందని మంత్రి కేటీఆర్ ట్వీట్​లో పేర్కొన్నారు.

ప్రజల హక్కుల కోసం పోరాడే ఏకైక టీమ్ బీఆర్ఎస్ : కవిత

MLC Kavitha on PM Modi Statements in BC Sabha :రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బీసీని తొలగించి.. ఓసీకి కట్టబెట్టిన మోదీ బీసీ నినాదం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేవలం ఎన్నికల కోసమే బీసీ వాదం అందుకున్న బీజేపీ.. బీసీని సీఎం చేస్తామని చెబుతోందని ఆరోపించారు. నిజామాబాద్​ మాట్లాడిన ఆమె.. మోదీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రూ.1000 కోట్ల బడ్జెట్ ఇస్తామని ఇవ్వలేదని ప్రధాని ఆరోపిస్తున్నారని.. కానీ రూ.6200 కోట్లు రాష్ట్ర సర్కార్ ఇచ్చిందని గుర్తు చేశారు.

బీజేపీ చెప్పుకునే సబ్ కా సాత్ - సబ్ కా వికాస్ నినాదంలో ఎక్కడా తెలంగాణ ప్రస్తావన లేదని.. లేదంటే రాష్ట్రానికి ఐఐఎం, ఐఐటీ, మెడికల్ కాలేజీలు వచ్చేవని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ మొదలు ప్రతి బీజేపీ నత తెలంగాణ గురించి అవహేళన చేస్తూ మాట్లాడటమే తప్ప మనస్పూర్తిగా సహకారం అందించిన సందర్భం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర చేస్తే అందులోనూ తెలంగాణ ప్రస్తావన లేదన్నారు. ఆ రెండు పార్టీల ఆలోచనలో కనీసం తెలంగాణ లేదని.. అటువంటి పార్టీలు మనకు అవసరమా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలని కవిత సూచించారు.

'కేసీఆర్ నవంబర్‌ 30న బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టడం ఖాయం'

'సంపద పెంచాలి- పేదలకు పంచాలనేదే కేసీఆర్ సిద్ధాంతం'

Last Updated : Nov 8, 2023, 10:24 AM IST

ABOUT THE AUTHOR

...view details