KTR Comments on Congress Govt :కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. గురువారం జరగబోయే గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారని, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి తమకు ఇచ్చారని చెప్తారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఆవరణలోని బీఆర్ఎస్(BRS Party) శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో కేటీఆర్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న రాహుల్ గాంధీ హామీ ఏమైందని ప్రశ్నించారు.
మాజీమంత్రి మల్లారెడ్డి అతని అనుచరులపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
తొలి కేబినెట్ భేటీలోనే ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న మాట ఏమైందని, హామీలిచ్చినపుడు ఆ సంగతి తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు పద్దులపై చర్చ జరుగలేదని, ప్రతి ఏడాది కాగ్ నివేదికలు(CAG Reports) ఇస్తున్నారని, అదేవిధంగా ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నామని ఆయన వివరించారు. తాము ఏటా పద్దులపై శ్వేతపత్రం విడుదల చేశామని కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR Fires on Congress Govt :రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి తమకు అప్పగించారని ఇక కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని విమర్శించారు. ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45వేల ఉద్యోగాలిస్తామన్నారు. అన్ని ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే స్పష్టత ఇవ్వట్లేదని ఆక్షేపించారు. ఎన్నికల ప్రచారంలో(Election Campaign) కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలని, కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడుంది అసలు ఆట అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.