ETV Bharat / state

బీఆర్ఎస్ పాలనలో వనరుల దుర్వినియోగం - త్వరలోనే వ్యవస్థలన్నింటిని గాడిలో పెడతాం : ఉపముఖ్యమంత్రి భట్టి

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 11, 2023, 1:46 PM IST

Updated : Dec 11, 2023, 2:49 PM IST

Bhatti Vikramarka on Telangana Economic Condition : బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆర్థిక పరిస్థితులపై శ్వేత పత్రం విడుదల చేస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మధిర నియోజకవర్గం అభివృద్ధిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఐదు సంవత్సరాలు ప్రణాళిక బద్ధంగా ఎలా అభివృద్ధి చేయాలి అన్న అంశాలను చర్చిస్తామని చెప్పారు.

Bhatti Fires on BRS Past Ruling
Bhatti Vikramarka on Telangana Economic Condition

Bhatti Vikramarka on Telangana Economic Condition : తెలంగాణ ఆర్థిక పరిస్థితులపై త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 2014 ముందు, ఆ తర్వాత బీఆర్ఎస్ పాలనలో ఉన్న ఆర్థిక పరిస్థితులపై శ్వేత పత్రం సిద్ధం చేస్తామని తెలిపారు. సరైన సమయంలో సరైన వేదికపై ఈ శ్వేత పత్రం విడుదల ఉంటుందని వెల్లడించారు.

చారిత్రాత్మకమైన ప్రజల తీర్పు తర్వాత తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని భట్టి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో దేవాలయంగా భావించే అసెంబ్లీలో ఈనెల 14 నుంచి సమావేశాలు జరుతాయని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం తెలంగాణ సమాజం కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకుందని గుర్తు చేశారు. పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదన్న భట్టి, వారి స్వేచ్ఛనూ హరించారని మండిపడ్డారు.

ఆర్థిక శాఖపై మంత్రి భట్టి విక్రమార్క సమీక్ష - 'అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే లక్ష్యాలు సాధిస్తాం'

Minister Bhatti Fires on BRS Govt : బీఆర్ఎస్ పాలనలో వనరుల దుర్వినియోగం, సంపద దోపిడికి గురైందని మంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. పది సంవత్సరాలు అస్తవ్యస్తమైన పాలన చేశారన్న ఆయన సంస్థలు, వ్యవస్థలు నిర్వీర్యం చేశారని విమర్శించారు. భారత రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న తర్వాత వ్యవస్థీకృతమైన సమాజాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం, నిర్వీర్యం చేసి 70 సంవత్సరాల వెనుకున్న ఆర్థిక అసమానతలు కలిసిన ఫ్యూడల్ సమాజాన్ని నిర్మించిందని తెలిపారు. రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ, డీజీపీ నుంచి గ్రామస్థాయి అధికారి వరకు ప్రజల కోసం పనిచేసే విధంగా తాము ముందుకెళ్తామన్నారు.

ప్రతి వ్యవస్థ, ప్రతి కార్యాలయం తన కోసమే ఉందని ఈ రాష్ట్ర ప్రజలకు నమ్మకాన్ని కల్పిండమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న కర్తవ్యమం. ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ, సంస్థలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలకోసం మాత్రమే అధికారులు పని చేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన అత్యంత పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని అధికారులు ప్రజలకు సేవలు అందించాలి. - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి

అధిష్ఠానానికి విధేయుడు, జనం మెచ్చిన నాయకుడు - తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు

Bhatti on Madhira Constituency Development : మధిర నియోజకవర్గం అభివృద్ధిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఆ సమావేశానికి బీఆర్ఎస్ నాయకులను కూడా ఆహ్వానిస్తామన్నారు. ఈనియోజకవర్గ అభివృద్ధికి ఏం కావాలి? భవిష్యత్తు అవసరాలు ఏంటి? ఐదు సంవత్సరాలు ప్రణాళిక బద్ధంగా ఎలా అభివృద్ధి చేయాలన్న అంశాలను చర్చిస్తామని చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, తనకున్న ఆలోచనలను జోడించి త్వరలో డ్యాకుమెంటరీ తయారు చేస్తామని తెలిపారు.

"పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో జరిగిన కుట్రపూరితమైన పాలనకు ఇక చరమగీతం పాడుతున్నాం. ప్రజా దర్బార్లు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతాయి. ప్రజలు ఇచ్చిన వినతులపై తిరిగి సమాధానాలు స్పష్టంగా ప్రజలకు అందించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమిస్తాం. గత ప్రభుత్వాలు తూతూ మంత్రంగా, జవాబుదారీగా లేకుండా గ్రీవెన్స్ నిర్వహించాయి. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయలేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు." - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి

Bhatti Vikramarka on Telangana Economic Condition బీఆర్ఎస్ పాలనలో వనరుల దుర్వినియోగం త్వరలోనే వ్యవస్థలన్నింటిని గాడిలో పెడతాం ఉపముఖ్యమంత్రి భట్టి

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు ఏటా రూ.70 వేల కోట్లు - సీఎం తొలి సంతకం దానిపైనే!

ఆరు గ్యారెంటీలకు వారెంటీ లేదన్న పెద్దలకు ప్రజలు ఓటుతో చెంపచెల్లుమనిపించారు : భట్టి విక్రమార్క

Last Updated : Dec 11, 2023, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.