తెలంగాణ

telangana

వారందరికీ రెండు వారాల్లోగా వార్షిక కౌలు చెల్లిస్తాం: హైకోర్టులో అధికారులు

By

Published : Dec 19, 2022, 6:59 PM IST

Gannavaram Airport Land Issue : ఏపీలోని గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి భూములిచ్చిన రైతులకు రెండు వారాల్లోగా వార్షిక కౌలును చెల్లిస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, గన్నవరం తహసీల్దార్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. విమానాశ్రయ అభివృద్ధికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం వార్షిక కౌలును చెల్లించటం లేదని గతంలో రైతులు హైకోర్టులో వేసిన వ్యాజంపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.

వారందరికీ రెండు వారాల్లోగా వార్షిక కౌలు చెల్లిస్తాం: హైకోర్టులో అధికారులు
వారందరికీ రెండు వారాల్లోగా వార్షిక కౌలు చెల్లిస్తాం: హైకోర్టులో అధికారులు

Gannavaram Airport Land Issue : ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి భూములిచ్చిన రైతులు.. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. విచారణకు కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, గన్నవరం తహసీల్దార్ హాజరయ్యారు. రైతులకు చెల్లించాల్సిన వార్షిక చెల్లింపులను రెండు వారాల్లోగా చెల్లిస్తామని అధికారులు న్యాయస్థానానికి తెలిపారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 6కు వాయిదా వేసింది. చెల్లింపులు జరపకపోతే మళ్లీ కోర్టుకు హాజరుకావాలని అధికారులను ఆదేశించింది.

గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం వార్షిక కౌలును చెల్లించటం లేదని గతంలో కొంతమంది రైతులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. వ్యాజ్యంపై విచారించిన ధర్మాసనం.. రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలును త్వరగా చెల్లించాలని, లేనిపక్షంలో అధికారులు కోర్టుకు హాజరుకావాలని గత విచారణలో ఆదేశించింది. అయినా ఇప్పటివరకు రైతులకు వార్షిక కౌలు ఇవ్వకపోవటంతో హైకోర్టు ఆదేశాల ప్రకారం అధికారులు నేడు కోర్టుకు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details