తెలంగాణ

telangana

Khairatabad Ganesh Nimajjanam 2023 : గణేశ్‌ నిమజ్జనాలకు పూర్తైన ఏర్పాట్లు.. రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసిన పోలీసులు

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2023, 6:43 PM IST

Updated : Sep 27, 2023, 7:47 PM IST

Khairatabad Ganesh Nimajjanam 2023 : హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనాలకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే పలు విగ్రహాల నిమజ్జనాలు ప్రారంభం కాగా.. పోలీసులు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్‌ నియంత్రణ, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పూర్తి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఖైరతాబాద్‌లో కొలువైన మహా గణపతి గురువారం గంగమ్మ ఒడికి చేరనున్నాడు. బుధవారం అర్థరాత్రి చివరి కలశ పూజ నిర్వహించిన అనంతరం స్వామివారి గురువారం ఉదయం శోభాయాత్ర కన్నుల పండువగా ప్రారంభంకానుందని నిర్వాహకులు చెబుతున్నారు.

Khairatabad Ganesh Nimajjanam 2023
Khairatabad Ganesh

Khairatabad Ganesh Nimajjanam 2023 గణేశ్‌ నిమజ్జనాలకు పూర్తైన ఏర్పాట్లు రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసిన పోలీసులు

Khairatabad Ganesh Nimajjanam 2023 :ఈ ఏడాది శ్రీ దశవిద్యా మహా గణపతి(Sri Dasha Maha Vidya Ganapathi)గా కొలువైన ఖైరతాబాద్‌ బడా గణపయ్య(Khairatabad Ganesh)ను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. చివరి రోజు కావడం వల్ల నగరంతో పాటు జిల్లాల నుంచి భారీగా తరలివచ్చారు. ఖైరతాబాద్‌ భారీ విఘ్నేశ్వరుడిని సుమారు 20 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి స్వామివారికి ఆఖరి సారిగా కలశపూజ నిర్వహించనున్నారు. అనంతరం స్వామి వారిని మండపం మీదనుంచి టస్కర్ మీదకి చేర్చి వెల్డింగ్ పనులు(Welding Works) నిర్వహించనున్నారు.

63 Feet Khairatabad Ganesh 2023 :63 అడుగుల ఎత్తులో కొలువైన మట్టి గణపతిని అత్యంత పదిలంగా హుస్సేన్ సాగర తీరానికి చేర్చేందుకు కమిటీ సభ్యులు ఇప్పటికే రూట్ మ్యాప్‌ని సైతం సిద్ధం చేశారు. టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్(Telugu Thalli Flyover) పక్కనుంచి సచివాలయం మీదుగా సాగర తీరానికి చేర్చనున్నారు. గురువారం మధ్యాహ్నంలోపు శోభాయాత్రను పూర్తిచేసి నిమజ్జన క్రతువు పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఖైరతాబాద్‌ మహాగణపతిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రికిషన్‌రెడ్డి(Kishan Reddy) దర్శించుకున్నారు. రాష్ట్రంలో కుటుంబపాలన పోయి.. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే సీఎం రావాలని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Khairatabad Ganesh Nimajjanam 2023 : రేపు ఉదయం 6 గంటల నుంచి ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర

Dasha Maha Vidya Ganapathi in Hyderabad :భాగ్యనగరంలో గణపతి నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కనులపండువగా జరిగే వేడుకను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వంలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నారు. హుస్సేన్‌సాగర్‌ వద్ద నిమజ్జనాలు ప్రశాంతంగా నిర్వహించేలా పోలీసులు చర్యలు చేపట్టారు. జంటనగరాల పరిధిలో 40 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు చేపట్టారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 228 పికెట్‌ ఏరియాలను ఏర్పాటు చేశారు.

Ganesh Shobha Yatra Hyderabad : నిమజ్జనం సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని.. ప్రజలు సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్ పాతబస్తీ చార్మినార్ ప్రాంతంలో పర్యటించి లంబోదరుడి శోభాయాత్ర ఏర్పాట్లను పరిశీలించారు. జీహెచ్​ఎంసీ కమిషనర్, మేయర్, పోలీసు కమిషనర్లు, ఇతర ప్రభుత్వాధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. చార్మినార్‌ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌ వరకు శోభాయాత్ర(Shobha Yatra) జరిగే ప్రదేశాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

Khairatabad Ganesh Immersion 2023 :శోభాయాత్రలు సాగే దారుల్లో సాధారణ వాహనాల రాకపోకలకపై ఆంక్షలు విధించారు. కొన్ని చోట్ల పూర్తిగా రాకపోకలు నిలిపివేయాలని నిర్ణయించగా.. మరికొన్ని ప్రత్యామ్నాయ దారుల్లోకి మళ్లించనున్నారు. భారీ లారీలు, ప్రైవేటు బస్సులకు నగరంలోని ప్రధాన రహదారుల్లోకి అనుమతి ఉండదని పోలీసులు స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఆంక్షల(Traffic Restrictions) దృష్ట్యా ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

Devotees Rush in Khairatabad Ganesh : ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు

Naveen Polishetty Visit Khairatabad Ganesh : ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకొన్న నటుడు నవీన్ పొలిశెట్టి..

Last Updated :Sep 27, 2023, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details