తెలంగాణ

telangana

నేడు దిల్లీకి కేసీఆర్.. ఎల్లుండి బీఆర్​ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం

By

Published : Dec 12, 2022, 6:37 AM IST

బీఆర్​ఎస్ ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి హస్తిన వెళుతున్నారు. ఇవాళ కుటుంబసభ్యులు, ముఖ్యనేతలతో కలిసి ఆయన దిల్లీ వెళ్తున్నారు. ఈనెల 14న బీఆర్​ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు పలువురు జాతీయ నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.

kcr
kcr

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ దిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఈనెల 14న దిల్లీలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. హస్తినలోని సర్దార్ పటేల్‌మార్గ్‌లో పార్టీ కార్యాలయ ప్రారంభం సందర్భంగా యాగం నిర్వహించనున్నారు. ఇప్పటికే దిల్లీ చేరుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ తదితరులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

14వ తేదీ యాగంతో పాటు ప్రారంభోత్సవానికి చెందిన ఏర్పాట్లు, కార్యాలయంలో అవసరమైన ఫర్నీచర్‌ వంటి వాటిని పరిశీలించారు. నేడు కేసీఆర్‌తో పాటు కుటుంబసభ్యులు, కొందరు ముఖ్యనేతలు కూడా హస్తిన వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా పలువురు జాతీయ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం ఉంది. భారత్ రాష్ట్ర సమితి, జాతీయ రాజకీయాలకు సంబందించిన అంశాలపై చర్చించనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details