తెలంగాణ

telangana

Ponguleti about joining in Congress : 'ఆలస్యం అవుతున్నందుకు క్షమించండి.. మరో రెండు రోజుల్లో నిర్ణయం'

By

Published : Jun 21, 2023, 6:04 PM IST

Ponguleti Srinivas joining Congress party : తాము ఏ పార్టీలో చేరబోతున్నామో అనేది మరో రెండు రోజుల్లో ప్రకటిస్తామని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి భేటీ అనంతరం ఇరువురు నేతలు స్పందించారు. త్వరలోనే వారి విధివిధానాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Ponguleti Srinivas
Ponguleti Srinivas

Jupalli Krishnarao joining Congress party : తాము ఏ పార్టీలో చేరాలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని బీఆర్​ఎస్​ బహిష్కృత నేతలు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. అనేక పరిణామాల అనంతరం ఇవాళ పీసీసీ రేవంత్​ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి పలువులు కాంగ్రెస్​ నేతలు వీరిని కలిశారు. సూదీర్ఘంగా నేతలతో చర్చించారు. మధ్యాహ్నం పొంగులేటి నివాసంలో భోజనం చేశారు. కాంగ్రెస్​లోకి రావాలని నేతలను రేవంత్​ రెడ్డి ఆహ్వానించారు. అందరు కలిసి వచ్చి కేసీఆర్​కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

భేటీ అనంతరం పొంగులేటి, జూపల్లి స్పందించారు. తమ నిర్ణయం మరో రెండు రోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. తమ నిర్ణయం ఆలస్యం అవుతున్నందుకు క్షమించండి అంటూ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. తాము బీఆర్​ఎస్​ నుంచి ఎందుకు బయటకు వచ్చామో అనేక వేదికలపై వివరించినట్లు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ వస్తే ప్రజల బతుకులు మారుతాయని ఆశించామని.. కాని వారి కలలు కలలుగానే మిగిలిపోయాని ఆవేదన వ్యక్తం చేశారు.

"ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకున్నాం. పార్టీ వివరాలు, చేరికలపై రెండు రోజుల్లో ప్రకటిస్తాం. ఆలస్యం అవుతున్నందుకు క్షమించండి. కాంగ్రెస్ నాయకులు మా ఇంటికి వచ్చారు. సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం అని చెప్పాం. మేం బీఆర్ఎస్ నుండి ఎందుకు బయటకి వచ్చామో అనేక వేదికలపై చెప్పాం. తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని తెలంగాణ బిడ్డలు ఆశించారు. తెలంగాణ ప్రజల కలలు కలలుగానే మిగిలాయి."-పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, మాజీ ఎంపీ

అనంతరం జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణలో ఎక్కడ చూసిన అవినీతి పేరుకుపోయిందని ఆరోపించారు. ఉద్యమ సమయంలో లక్షకి ఐదు లక్షలకి ఇబ్బంది పడ్డ కేసీఆర్​కు ఇన్ని లక్షల కోట్లు ఎలా వచ్చాయని విమర్శించారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలని బుజువు చేస్తామని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనేదే తమ ప్రయత్నమని.. అందర్నీ కూడగట్టడానికే ఆలస్యం అవుతోందని జూపల్లి పేర్కొన్నారు.

"తెలంగాణ కోసం రాజీనామా చేసి పోరాటం చేశా. కేసీఆర్ చెప్పేదానికి చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రజలని కేసీఆర్ అవమానిస్తున్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. కేసీఆర్ ఎందులో ఆదర్శమో చెప్పాలి. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలని రుజువు చేస్తాం. ఎక్కడ చూసిన అవినీతి పేరుకుపోయింది. కోట్ల రూపాయలు ఉంటే తప్పా పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఉద్యమ సమయంలో లక్షకి ఐదు లక్షలకి ఇబ్బంది పడ్డ కేసీఆర్ దగ్గర ఇన్ని లక్షల కోట్లు ఎలా వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. అందర్నీ కూడగట్టడానికే ఆలస్యం అవుతోంది. తెలంగాణ ప్రజలకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నా.. ఇప్పుడు జరగనున్న ఉద్యమంలో ప్రజలంతా భాగం కావాలి".- జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి

'ఆలస్యం అవుతున్నందుకు క్షమించండి.. మరో రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తాం'

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details