తెలంగాణ

telangana

Internal Conflicts Between Khammam BRS Leaders : ఎవరికి వారే అన్నట్లుగా ఉమ్మడి ఖమ్మం బీఆర్​ఎస్​ నేతల తీరు.. అధినేత స్పెషల్​ ఫోకస్

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2023, 7:50 AM IST

Internal Conflicts Between Khammam BRS Leaders : దాదాపు మూడు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ దళపతి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారించారు. గత రెండు ఎన్నికల మాదిరి కాకుండా ఈసారి అత్యధిక స్థానాలు గెలిచేలా కలిసికట్టుగా పని చేయాలని పార్టీ నేతలకు సూచించారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన నేతలు.. 10కి పది స్థానాలు గెలిచి కేసీఆర్​కు కానుకగా ఇస్తామంటున్నా.. తగిన కార్యాచరణ మాత్రం కనిపించట్లేదు. పలువురు ముఖ్య నేతలు పార్టీ వీడటంతో గట్టి ఎదురుదెబ్బ తగలగా.. మిగతా వారు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉండటం బీఆర్​ఎస్​ శ్రేణుల్ని కలవరపెడుతోంది. రానున్న ఎన్నికల్లో నేతలు కలహాలు వీడి కలిసిసాగుతారా లేదా అన్న ప్రశ్నలు గులాబీ కార్యకర్తలను తొలచి వేస్తున్నాయి.

Khammam BRS Leaders Fight
Internal Conflicts in Khammam BRS Party

Internal Conflicts Between Khammam BRS Leaders ఎవరికి వారే అన్నట్లుగా ఉమ్మడి ఖమ్మం బీఆర్​ఎస్​ నేతల తీరు అధినేత స్పెషల్​ ఫోకస్

Internal Conflicts in Khammam BRS Party : రాష్ట్రవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి(BRS)కి బ్రహ్మరథం పట్టినా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేదు ఫలితాలను చవిచూసింది. 2014లో కొత్తగూడెం, 2018లో ఖమ్మం అసెంబ్లీ స్థానాలు(Khammam Assembly Seats) మాత్రమే గెలుచుకుని ఒక్క స్థానానికి పరిమితమైంది. దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్​ఎస్​ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అత్యధిక స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాపైనే దృష్టి సారిస్తానని స్వయంగా సీఎం కేసీఆర్(CM KCR)​.. జిల్లా నేతలకు పలుమార్లు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో ప్రస్తుతం బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల బలం 8కి చేరింది. ఇదే సమయంలో ఎన్నికల సమీపిస్తున్న కొద్ది కారు పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

Khammam BRS Leaders Fight : ముఖ్యనేతల్లో ఒకరైన పొంగులేటి ఇప్పటికే కాంగ్రెస్‌ గూటికి చేరగా.. రేపో మాపో, పార్టీ మారేందుకు రాజకీయ దిగ్గజం తుమ్మల సిద్ధమవుతున్నారు. ఓ వైపు ఇన్ని పరిణామాలు సాగుతున్నా.. గులాబీ నేతల్లో సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత పలు జిల్లాల్లో ఎన్నికల సన్నాహక కార్యక్రమాలు, నియోజకవర్గాల వారీగా సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ముఖ్య నేతలంతా వారి నియోజకవర్గాలకే పరిమితం అవ్వటంతో ఎవరికే వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. ఈ పరిణామంతో పార్టీ శ్రేణుల్లో కొంత స్తబ్ధత కనిపిస్తోంది.

వ్యక్తిగత విభేదాలు వీడి కలిసి పనిచేయండి... ఖమ్మం బీఆర్​ఎస్​ నేతలకు కేసీఆర్​ దిశానిర్దేశం

Internal Clashes in Khammam BRS Party : ఇప్పటికే వలసలతో ఇబ్బంది పడుతున్న గులాబీ పార్టీకి ఇటీవల ప్రకటించిన ఎన్నికల సమన్వయకర్తల నియామకం అగ్గి రాజేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్​ఎస్​ ఇంఛార్జీలను నియమించింది. అయితే పలు చోట్ల ఇంఛార్జీలు అవసరం లేదని అంటుండగా భద్రాచలం ఇంఛార్జీని తొలగించి గతంలో ఉన్న నాయకుడికే ఇవ్వాలని అక్కడి నేతలు పట్టుపడుతుండటంతో అక్కడ నిర్వహించాల్సిన సన్నాహక సమావేశం వాయిదా పడింది. కొత్తగూడెం ఇంఛార్జీ వద్దిరాజు రవిచంద్ర నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఎంపీ నామా, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్‌, రేగా కాంతారావు గైర్హాజరవటం చర్చనీయాంశంగా మారింది.

బీఆర్​ఎస్​లో అంతర్గత పోరు.. మంత్రులు Vs ఎమ్మెల్యేలు

"నాకు ఏ బాధ్యత ఇచ్చినా అది నిర్వర్తించాను. నా ఎన్నికలప్పుడు నేను ఒక్కడినే గెలిచాను. ఆ తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికలను గెలిపించాం. అన్ని ఎన్నికల్లోనూ పార్టీని మెజార్టీతో గెలిపించాం. అన్ని ఎన్నికల్లో పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాను. ఇప్పుడు నాకు ఏ బాధ్యత అప్పగిస్తే అది పరిపూర్ణంగా నిర్వర్తిస్తాను."- పువ్వాడ అజయ్, రవాణా శాఖ మంత్రి

Telangana Assembly Election 2023 : ఇందుకు సమన్వయ లేమి ప్రధాన కారణమన్నది పార్టీ వర్గాల్లో చర్చ. వీటన్నింటికి తోడు అభ్యర్థుల ప్రకటన తర్వాత చెలరేగిన అసమ్మతి జ్వాలలు ఇంకా చల్లారలేదు. అసంతృప్తుల్ని బుజ్జగించి పార్టీని గాడిన పెట్టేందుకు చర్యలు చేపట్టకపోవటం పార్టీ పరిస్థితులకు అద్దం పడుతోందని మాటలు వినిపిస్తున్నాయి. నేతలు మాత్రం ఐక్యంగా ముందుకు సాగుతామని..10కి 10 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్​ఎస్​లో తాజా రాజకీయ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోనన్న చర్చ సాగుతుంది. ఇప్పటికైనా నేతలంతా సమన్వయంతో ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగిన.. అనేక సందేహాలు గులాబీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

MLA Rajaiah Interesting Comments on 2023 Elections : 'ఎన్నికలు వాయిదా పడొచ్చు.. బీఆర్​ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో మార్పులకు అవకాశాలు!

MLA Tickets Clash in BRS : బీఆర్​ఎస్​ కారులో కుదుపులు.. నేతల మధ్య ముదిరిన విభేదాలు..!

ABOUT THE AUTHOR

...view details