తెలంగాణ

telangana

అనుమాస్పదస్థితిలో ఇంటర్​ విద్యార్థిని మృతి

By

Published : May 29, 2020, 5:38 PM IST

ఇంటి నుంచి అదృశ్యమైన ఇంటర్​ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన సికింద్రాబాద్​ చిలకలగూడ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

inter student suspect death at chilakalaguda
అనుమాస్పదస్థితిలో ఇంటర్​ విద్యార్థిని మృతి

సికింద్రాబాద్​ చిలకలగూడ ఠాణా పరిధిలో విషాదం జరిగింది. ఇంటి నుంచి అదృశ్యమైన ఇంటర్​ విద్యార్థిని మయూరి అనుమాన్పద స్థితిలో శవమై కనిపించింది. సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన మయూరి ఇంటర్​ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తమ కుమార్తె గురువారం సాయంత్రం నుంచి కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు చిలకలగూడ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఆమె ఇంటికి సమీపంలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. ఘటనాస్థలికి చేరిన పోలీసులు... ఆ మృతదేహం విద్యార్థిని మయూరిదిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న దంపతులు

ABOUT THE AUTHOR

...view details