తెలంగాణ

telangana

KTR: రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలి

By

Published : Jul 6, 2021, 3:47 PM IST

కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు చేయూత అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్(KTR) స్పష్టం చేశారు. ఇండియన్ బ్యాంకు రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల బలోపేతానికి తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ ప్రేరణ కార్యక్రమాన్ని ఆయన వర్చువల్​గా ప్రారంభించారు.

ktr, msme
కేటీఆర్​, ఎంఎస్​ఎంఈ

ఇండియన్ బ్యాంకు రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల బలోపేతానికి తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ ప్రేరణ కార్యక్రమాన్ని ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్(KTR) వర్చువల్​గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ సీఈవో పద్మజ చుండూరు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ సహా పలువురు పాల్గొన్నారు. రుణాల అందజేత, ఫైనాన్స్, మార్కెటింగ్ వంటి అంశాల్లో ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించేలా ప్రేరణ కార్యక్రమాన్ని చేపట్టామని ఇండియన్ బ్యాంక్ సీఈవో పద్మజ తెలిపారు.

కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు చేయూత అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేటీఆర్​ తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు రెండు సమతుల్యంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పేరుతో కరోనా సంక్షోభంలో ఉన్న పరిశ్రమలకు చేయూత ఇస్తున్నామని... బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చి.. వారికి అండగా నిలవాలని కేటీఆర్ కోరారు. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్​తో కలిసి ఇండియన్ బ్యాంక్ పని చేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు క్లోజర్ నోటీస్ ఇచ్చేముందు బ్యాంకులు కాస్త వాటి పరిస్థితిపై అధ్యయనం చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు.

ఇంగ్లీష్​, హిందీ, ఉర్దూతో పాటు తెలుగులో ఎంఎస్ఎంఈ ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఇండియన్​ బ్యాంకు​కు కృతజ్ఞతలు. బ్యాంకు పేరులోనే దేశం పేరు ఉంది. పబ్లిక్​ సెక్టర్​ బ్యాంకుల్లో ఇండియన్​ బ్యాంకు మంచి స్థానంలో ఉంది. ఇండియన్​ బ్యాంకు సీఈవో పద్మజ నిజాం కాలేజీ పూర్వ విద్యార్థి, నేను కూడా నిజాం కాలేజీలో చదువుకున్నాను. సీఎం కేసీఆర్​ ఒకటి చెబుతుంటారు. బలవంతుడికి మనం కొత్తగా చేసేది ఏమి ఉండదు. కాని బలహీనులకు మాత్రం సాయం చేయాలని.

-కేటీఆర్​, ఐటీ, పురపాలక శాఖ మంత్రి

KTR: రుణాల ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలి

ఇదీ చదవండి:Galaxy F22: బడ్జెట్ ధరలో శాంసంగ్ కొత్త ఫోన్​- ఫీచర్లు ఇవే

ABOUT THE AUTHOR

...view details