తెలంగాణ

telangana

Vande Bharat Express : 16 బోగీలతో సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్

By

Published : May 17, 2023, 10:44 PM IST

Vande Bharat Express
Vande Bharat Express ()

Vande Bharat Express Train From Secunderabad To Tirupati : పదహారు బోగీలతో నడిచే సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మొదటి ట్రిప్ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్ నుంచి 109శాతం ప్రయాణీకులతో బయలుదేరినట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. గతంలో కంటే 15 నిమిషాల తక్కువ సమయంలో వందేభారత్ గమ్యస్థానికి చేరుకున్నట్లు తెలిపారు. ప్రయాణీకుల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. 8 కోచ్‌లను 16 కోచ్‌లకు రెట్టింపు చేశారు. రైలు సీటింగ్ సామర్థ్యం 530 సీట్ల నుండి 1,128 సీట్లకు పెంచారు.

Vande Bharat Express Train From Secunderabad To Tirupati : సికింద్రాబాద్​ నుంచి తిరుపతి వెళ్లాల్సిన వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ రైలు మొదటి ట్రిప్​ బుధవారం నుంచి ప్రారంభమైంది. వందే భారత్​ రైలు సికింద్రాబాద్​ నుంచి 109 శాతం ప్రయాణికులతో బయలుదేరినట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. గతంలో కంటే 15 నిమిషాల తక్కువ సమయంలో వందేభారత్​ రైలు గమ్యస్థానానికి చేరుకున్నట్లు అధికారులు వివరించారు. సికింద్రాబాద్​ నుంచి తిరుపతికి మళ్లీ సికింద్రాబాద్​కు ప్రధాని రైలు ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ప్రయాణికుల నుంచి భారీ స్పందన వస్తోందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

ఈ రైలు రెండు వైపులా 130 శాతం కంటే ఎక్కువ ఓఆర్​తో నడిచినట్లు రైల్వే అధికారులు వెల్లడించి.. హర్షం వ్యక్తం చేశారు. అయితే రైలు ప్రారంభించినప్పుడు 8 కోచ్​లు మాత్రమే ఉండడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రయాణికుల నుంచి కోచ్​లు పెంచాలని అభ్యర్థనలు, డిమాండ్​లు రైల్వే శాఖకు వెల్లువెత్తాయి. దీంతో భారతీయ రైల్వే.. రైలులోని కోచ్​ల సంఖ్యను 8 నుంచి 16కు రెట్టింపు సంఖ్యలో పెంచింది. దీంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా మరో విశేషం ఏమిటంటే రైలులోని సీట్​ల సామర్థ్యం కూడా 530 నుంచి ఏకంగా 1128కు పెంచారు. ప్రస్తుతం సికింద్రాబాద్​ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్​ ఎక్స్​ప్రెస్​లో ఎగ్జిక్యూటివ్​ క్లాస్​లో 104 సీట్లు.. చైర్​ కార్​లో మరో 1024 సీట్లు అదనంగా చేరారు.

రైలులోని సీట్​ల సామర్థ్యం పెంచిన మొదటి ట్రిప్​లో 1228 మంది ప్రయాణికులు ముందస్తుగా తమ టికెట్​ను బుక్​ చేసుకున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ రైలు ప్రయాణీకుల సౌకర్యాన్ని మరింత పెంచేందుకు దక్షిణ మధ్య రైల్వే.. మరికొన్ని ఏర్పాట్లను చేసింది. ఈ బుధవారం నుంచి రెండు వైపులా ప్రయాణ సమయాన్ని 15 నిమిషాలు తగ్గించనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు ఈ తగ్గించిన సమయం ఎంతో దోహదపడుతోందని రైల్వేశాఖ భావిస్తోంది. ఈ రైలులో ప్రయాణించే ప్రయాణికుల జీపీఎస్​ ఆధారిత ప్యాసింజర్​ ఇన్ఫర్మేషన్​ సిస్టమ్​, ఆటోమేటిక్​ స్లైడింగ్​ డోర్లు, రిక్లైనింగ్​ సీట్లు, ప్రతి కోచ్​లో సీసీ కెమెరాలు, ఎల్​ఈడీ లైటింగ్​.. ప్రతి సీటు కింద ఛార్జింగ్​ పాయింట్లు వంటివి ఏర్పాటు చేశారు. ఈ అద్భుతమైన ఫీచర్లను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details