తెలంగాణ

telangana

'డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్'

By

Published : Feb 4, 2021, 3:33 PM IST

హైదరాబాద్ సనత్‌నగర్‌ పరిధిలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తెలిపారు. ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 15 వరకు పలు చోట్ల పర్యటించి.. ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొంటారని పేర్కొన్నారు.

inaugurate  double bedroom house over KTR at sanathnager
కేటీఆర్ చేతుల మీదుగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ప్రారంభం: తలసాని

హైదరాబాద్‌ సనత్​నగర్ నియోజకవర్గ పరిధిలోని రెండు పడక గదుల ఇండ్లను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తెలిపారు. హైదరాబాద్‌లో ఇళ్ల నిర్మాణ పనులపై వివిధ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పేదప్రజల సొంత ఇంటి కల నెరవేర్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం చేపట్టామన్న ఆయన... కేటీఆర్ చేతుల మీదుగా వాటి ప్రారంభోత్సవానికి తేదీలు ఖరారు చేశారు.

  • ఫిబ్రవరి 19: పొట్టి శ్రీరాములు నగర్​లో 162 ఇళ్లు
  • మార్చి 5: అంబేద్కర్ నగర్​లోని 330 ఇళ్లు
  • మార్చి 8: గొల్ల కొమరయ్య కాలనీలో 12 ఇళ్లు
  • మార్చి 10: జీవైఆర్ కాంపౌండ్​లో 180 ఇళ్లు
  • మార్చి 20: బండ మైసమ్మ నగర్​లో 310 ఇళ్లు
  • ఏప్రిల్ 15: చాచా నెహ్రూనగర్ లో 264 ఇళ్లు

ABOUT THE AUTHOR

...view details