తెలంగాణ

telangana

Iftar Party: వెల్లివిరుస్తున్న మతసామరస్యం.. రాష్ట్రంలో జోరుగా ఇఫ్తార్‌ విందు కార్యక్రమాలు

By

Published : Apr 18, 2023, 7:59 AM IST

Iftar Parties in Telangana: రంజాన్‌ పండుగను పురస్కరించుకుని.. రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలకు ఇఫ్తార్‌ విందు కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. పలుచోట్ల రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్‌ విందులు నిర్వహిస్తోంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొని.. ముస్లింల సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీలు ఇస్తున్నారు. పలు చోట్ల కాంగ్రెస్‌ పార్టీ నేతలు సైతం.. ఇఫ్తార్‌ విందులతో ముస్లింలకు భరోసా కల్పిస్తున్నారు.

Iftar Dinner
Iftar Dinner

రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ముస్లింలకు ఇఫ్తార్‌ విందు కార్యక్రమాలు

Iftar Parties in Telangana: పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని... రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలకు ఇఫ్తార్​ విందు కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్‌ నాంపల్లి గృహకల్పలోని టీఎన్​జీఓఎస్ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుసేన్ ఆధ్వర్యంలో.. దావత్ ఇ ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మైనార్టీ కమిషన్ ఛైర్మన్ తారిక్ హన్సారి, టీఎన్​జీఓఎస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌తో పాటు.. ముస్లింలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

సంస్కృతి.. సంప్రదాయాలను కాపాడేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారు : ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని... మంత్రి మహమూద్‌ అలీ కొనియాడారు. హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ శివారులోని... సైలానీ బాబా దర్గాలో ఆత్మకూరు, దామెర మండలాల ముస్లింలతో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి సంస్కృతి.. సంప్రదాయాలను కాపాడేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని.. మంత్రి సత్యవతి రాఠోడ్‌ తెలిపారు. మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో... ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి ఆమె హాజరయ్యారు.

అధినాయకత్వం నుంచి క్షేత్రస్థాయి వరకు అండగా ఉంటాం : నిర్మల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిటీ కన్వెన్షన్​ హాల్​లో సోమవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, అద్దంకి దయాకర్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని.. కొందరు వ్యక్తులు పార్టీని వీడినా నష్టం లేదని.. వచ్చేది తమ ప్రభుత్వమే అని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో... ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు మానిక్ రావు ఠాక్రే, ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి, పీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు పొన్నాల, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజారుద్దీన్‌తో కలిసి హాజరయ్యారు.

కాంగ్రెస్ పార్టీతో పాటు అధినాయకత్వం నుంచి క్షేత్రస్థాయి వరకు అందరూ ముస్లింలకు అండగా ఉంటామని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇఫ్తార్‌ విందులో ముస్లింలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు... ఒకరికొకరు రంజాన్‌ ముబారక్‌లు చెప్పుకుంటూ.. సందడిగా గడిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details